సిఎం గా షిండే, డిప్యూటీ సిఎం గా ఫడ్నవిస్
ముంబై : మహారాష్ట్రలో భాజపా, శివసేన సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. మహారాష్ట్ర 20వ సీఎంగా ఏక్‌నాథ్ షిండే తో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ రాజ్ భవన్ లో ప్రమాణస్వీకారం చేయించారు. డిప్యూటీ సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేశారు. భాజపా, శివసేన ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో కింగ్ మేకర్ అవుతారనుకున్న ఏక్‌నాథ్ షిండే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా కింగ్ అయ్యారు.
శివసేన నుండి ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో మొదలైన సంక్షోభం, తీవ్రస్థాయిలో కొనసాగడంతో బుధవారం ఉద్ధవ్ థాక్రే సీఎంగా రాజీనామా చేశారు. దీంతో 2019లో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కలిసి ఏర్పాటు చేసిన మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయింది. దీంతో గురువారం భాజపా, శివసేన రెబల్ వర్గం ఎమ్మెల్యేలు కలిసి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి :
1. BREAKING : పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల, 90 శాతం ఉత్తీర్ణత









