సీఎం కేసీఆర్ కు కిషన్ రెడ్డి లేఖ
హైదరాబాద్, మనసాక్షి : ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రామగుండంలో వంద పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి భూమిని కేటాయించాలని లేఖలో పేర్కొన్నారు. అందుకు అవసరమైన ఐదెకరాల భూమి కేటాయింపుపై తీవ్ర జాప్యం జరుగుతుందని తెలిపారు. కార్మికులకు వైద్య అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఆసుపత్రికి స్థలాన్ని కేటాయించేలా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.









