Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఅభివృద్దిజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : మిర్యాలగూడలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి డేట్ ఫిక్స్..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్‌లో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇందిరమ్మ ఇళ్ల పంపిణికి ఎట్టకేలకు డేట్ ఫిక్స్ అయింది. సోమవారం స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఇండ్లను అధికారులతో కలిసి పరిశీలించారు.

Miryalaguda : మిర్యాలగూడలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి డేట్ ఫిక్స్..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్‌లో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇందిరమ్మ ఇళ్ల పంపిణికి ఎట్టకేలకు డేట్ ఫిక్స్ అయింది. సోమవారం స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఇండ్లను అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
ఈ నెల 6వ తేదీన డబుల్ బెడ్ రూమ్ ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

రాష్ట్ర మంత్రులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమానికి వచ్చే మంత్రులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.

Also Read : కరువును జయించిన రైతు..బీర సాగుతో రూ.2.40 లక్షల లాభం..!

ముఖ్యంగా సభా ప్రాంగణం, వేదిక ఏర్పాటు, పార్కింగ్, తాగునీరు, విద్యుత్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరిగేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు..

ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా కృషి చేస్తోందని, అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ రమణారెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీజా రెడ్డి, ఎంపిడిఓ శేషగిరి శర్మ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు