Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

తోపుచర్ల ఎత్తిపోతల పథకం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..!

తోపుచర్ల ఎత్తిపోతల పథకం పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండి పనికి నోచుకోలేదు.

తోపుచర్ల ఎత్తిపోతల పథకం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..!

పనులు ప్రారంభించాలి.. గ్రామ ప్రజల వేడుకోలు.. ఎంపీ, ఎమ్మెల్యేకు విన్నపం

(మాడ్గులపల్లి – మౌలాలి)

మాడ్గులపల్లి మండలంలోని తోపుచర్ల, గ్రామపంచాయతీ పరిధిలోని గున్ రెడ్డి గూడెం, సీత్యాతండ గ్రామ పంచాయతీ పరిధిలోని పుచ్చకాయలగూడెం, బొమ్మకల్లు గ్రామ పంచాయతీ పరిధిలోని గణపతివారి గూడెం, దేవతలవాయిగూడెం, బొమ్మకల్ చెరువులు నింపేందుకు వేములపల్లి మండల కేంద్రంలోని నాగార్జున సాగర్ ఎడమ కాలువ 14వ ఎత్తిపోతల పథకం నుంచి సీత్యాతండ వరకు నూతనంగా ఎత్తిపోతల పథకాన్ని ఆనాటి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది.

Also Read : Miryalaguda : మిర్యాలగూడలో బియ్యం విక్రయ కేంద్రం ప్రారంభం.. కిలో ఎంతంటే..!

ఏళ్లు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే:

ఆ తరువాత జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నప్పటికీ తోపుచర్ల ఎత్తిపోతల పథకం పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండి పనికి నోచుకోలేదు. ఎన్నోసార్లు స్థానిక శాసనసభ్యుడిని అడిగితే శాసనసభ్యుడు దున్నపోతుల గండి పూర్తి అయితే ఆ తరువాత అవుతుంది అని, అది అయిపోయిన తర్వాత ఒక నెల రోజుల్లో పని మొదలుపెడతామని గడిచిన మే నెలలో చెప్పారు. ఇంతవరకు ఆ పని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనేలా ఉంది.

నీరు వచ్చే పరిస్థితి లేదు – తాగునీటికి తీవ్ర ఇబ్బంది:

మాకు ఇటు 40వ పంపిణీ కాలువ నుంచి కానీ, ఎత్తిపోతల పథకం ద్వారా కానీ నీరు వచ్చే పరిస్థితి లేదు. మా గ్రామ పంచాయతీలను పట్టించుకునే నాథుడే లేడు. తాగునీటికి, పశువులకు, ప్రజలకు చాలా ఇబ్బంది అవుతున్నది.

మాకు చావే గతి – ప్రజల ఆవేదన:

స్థానిక ప్రజాప్రతినిధులు మా గ్రామ ప్రజలను పట్టించుకోకపోతే మాకు చావే గతి. దయచేసి మాకు ఈ ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించి పూర్తి చేయాలని తోపుచర్ల, సీత్యాతండ, బొమ్మకల్ గ్రామ పంచాయతీల ప్రజలు వేడుకుంటున్నారు.

మరిన్ని వార్తలు