Breaking Newsక్రైంజయశంకర్ భూపాలపల్లి జిల్లాజిల్లా వార్తలు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..!
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కేంద్రంలో చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం రాత్రి జరిగింది.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..!
మన సాక్షి, వెబ్ డేస్క్ :
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కేంద్రంలో చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం రాత్రి జరిగింది. లారీ ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పాలకుర్తి తిరుపతి (37) అక్కడికక్కడే మృతి చెందాడు. గోరి కొత్తపల్లి మండలం వెంకటేశ్వర పల్లి గ్రామానికి చెందిన తిరుపతి పరకాల లోని ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
బైక్ పై ఇంటికి వెళుతుండగా భూపాలపల్లి వైపు నుంచి వేగంగా వచ్చిన ఒక లారీ రేగొండ చెక్ పోస్ట్ వద్ద అతడి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తిరుపతికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరకాల ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.









