Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణ
ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి, ఏడేళ్ల కుమార్తె మృతి..!
హుస్నాబాద్ మండలం పందిళ్ల బ్రిడ్జి దాటిన తర్వాత పవనసుత మిల్లు సమీపంలో కారు, ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తండ్రి పైడపల్లి శ్రీకాంత్ (33), కుమార్తె మహాన్వి (7) మృతిచెందారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి, ఏడేళ్ల కుమార్తె మృతి..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
హుస్నాబాద్ మండలం పందిళ్ల బ్రిడ్జి దాటిన తర్వాత పవనసుత మిల్లు సమీపంలో కారు, ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తండ్రి పైడపల్లి శ్రీకాంత్ (33), కుమార్తె మహాన్వి (7) మృతిచెందారు.
హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్ భార్య స్వాతి, కుమార్తె, కుమారుడు విహాన్ క్రిష్‌తో కలిసి స్వగ్రామం కొండాపూర్‌కు కారులో బయలుదేరారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భార్య స్వాతితో పాటు కుమారుడు విహాన్ క్రిష్‌ను కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కుమారుడికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ట్రాక్టర్ డ్రైవర్ కాలు విరిగింది.
ఒకే కుటుంబంలో తండ్రి, కుమార్తె ప్రాణాలు కోల్పోవడంతో కొండాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.









