Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి

వామ్మో మామూలు స్కెచ్ కాదు.. ఉద్యోగం, జీతం, సర్టిఫికెట్లు అన్ని ఫేక్.. లోన్ మాత్రం 30 లక్షలు..!

ఉద్యోగం ఫేక్.. జీతం ఫేక్.. సర్టిఫికెట్లు ఫేక్.. అంతా నకిలీ.. కానీ 30 లక్షల లోన్ మాత్రం నిజం. ఈ ఘటన ఇబ్రహీంపట్నం లో చోటు చేసుకుంది.

వామ్మో మామూలు స్కెచ్ కాదు.. ఉద్యోగం, జీతం, సర్టిఫికెట్లు అన్ని ఫేక్.. లోన్ మాత్రం 30 లక్షలు..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

ఉద్యోగం ఫేక్.. జీతం ఫేక్.. సర్టిఫికెట్లు ఫేక్.. అంతా నకిలీ.. కానీ 30 లక్షల లోన్ మాత్రం నిజం. ఈ ఘటన ఇబ్రహీంపట్నం లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. పక్కా స్కెచ్ తో నకిలీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, ఉద్యోగ నియామక పత్రం, జీతం, ఇవన్నీ ఫేక్ సర్టిఫికెట్లు పుట్టించి బ్యాంకును బురిడీ కొట్టించిన ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రామావత్ గోపాల్, పులి సురేష్ బాబు కలిసి గంటల శంకర్ పేరుతో నకిలీ పత్రాలను తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ ఆధార్ కార్డు పాన్ కార్డులతో పాటు పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ సర్టిఫికెట్లను కూడా తయారు చేశారు. గంటల శంకర్ బెంగళూరులోని ప్రముఖ క్యాప్కో టెక్నాలజీ సంస్థలు సీనియర్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నట్లుగా నకిలీ ఉద్యోగ పత్రాలు, జీతంకు సంబంధించిన పే స్లిప్ లను కూడా తయారు చేశారు. ఈ పత్రాలను ఐసిఐసిఐ బ్యాంకులో సమర్పించి గంటల శంకర్ పేరుతో ఏకంగా 30 లక్షల రూపాయలను వ్యక్తిగత రుణంగా మంజూరు చేయించుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

Also Read : Miryalaguda : మిర్యాలగూడ రైస్ మిలర్స్ కీలక నిర్ణయం.. ధాన్యం ధర ఫిక్స్.. క్వింటాల్‌కు ఎంతంటే..!

ఈ రుణం మంజూరు వ్యవహారంలో కీలక పాత్ర పోషించినందుకు రమావత్ సురేష్ కు 6.70 లక్షల కమిషన్ చెల్లించినట్లు విచారణలో వెళ్లడైంది. శంకర్ పేరుతో పొందిన క్రెడిట్ కార్డును ఉపయోగించి మూడు లక్షల వరకు ఖర్చు చేసినట్లు విచారణలో తేలింది. ఈ కేసు విషయంలో రమావత్ గోపాల్, పులి సురేష్ బాబు, రమావత్ సురేష్, గంటల శంకర్, గంటల శ్రీనివాసలను నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు.

వీరిలో గోపాల్, సురేష్ బాబు సుమిత్రో టెక్నాలజిస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి లుగా ఉన్నట్లు గుర్తించారు. నకిలీ పత్రాలు తయారీ, బ్యాంకు రుణం మంజూరు చేయించిన విధానం, కమిషన్ చెల్లింపులు, క్రెడిట్ కార్డు వినియోగం వెనుక ఉన్న పూర్తి వ్యవహారం పై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

నకిలీ ధ్రువీకరణ పత్రాలతో మోసాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని ఇబ్రహీంపట్నం సీఐ మహేందర్రెడ్డి హెచ్చరించారు. వివరాలను దర్యాప్తు వెళ్ళడయ్యే అవకాశాలు మరింతగా నకిలీ పత్రాలతో బ్యాంకులను మోసగించే ముఠాలపై నిఘా కొనసాగుతుందని సీఐ పేర్కొన్నారు

మరిన్ని వార్తలు