అమెరికాలో నల్గొండ యువతి అదృశ్యం.. ఫోన్లో పరామర్శించిన కేటీఆర్..!
నల్గొండ జిల్లా కనగల్ మండలం షాబ్దుల్లాపురం గ్రామానికి చెందిన యువతి అమెరికాలో అదృశ్యం అయింది.

అమెరికాలో నల్గొండ యువతి అదృశ్యం.. ఫోన్లో పరామర్శించిన కేటీఆర్..!
మన సాక్షి, కనగల్ :
నల్గొండ జిల్లా కనగల్ మండలం షాబ్దుల్లాపురం గ్రామానికి చెందిన యువతి అమెరికాలో అదృశ్యం అయింది. గ్రామానికి చెందిన యాదగిరి రెడ్డి, రూప దంపతులకు కుమార్తె శ్రీజ (23) ఉన్నత చదువుల కోసం అమెరికాలోని బోస్థాన్ కు వెళ్ళింది. బోస్టాన్ లో చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తున్నది. ఈనెల 2వ తేదీన వాకింగ్ కోసం వెళ్ళిన శ్రీజ తిరిగి రాలేదు. ఆమె ఫోన్ చివరి లోకేషన్ సమీపంలోనే బీచ్ వద్ద చూపిస్తుందని తల్లిదండ్రులు, స్నేహితులు పేర్కొంటున్నారు.
Also Read : అర్థరాత్రి
దాంతో అమెరికాలో మిస్సింగ్ అయిన శ్రీజ తల్లిదండ్రులను నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పరామర్శించారు. అదేవిధంగా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఫోన్లో మాట్లాడి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. అమెరికాలో తెలిసిన వారితో తాను మాట్లాడుతానని కేటీఆర్ వారికి భరోసా ఇచ్చారు.










