Miryalaguda : ఈదులగూడ జంక్షన్ వద్ద 100 ఫీట్ల సిమెంట్ రోడ్డు.. నిర్మాణ పనులకు శ్రీకారం..!
మిర్యాలగూడ పట్టణంలోని ఇదులగూడ జంక్షన్ వద్ద ప్రజలకు రాకపోకల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా, ప్రధాన రహదారిపై సురక్షితంగా ప్రయాణించేలా ప్రమాదాల నివారణ లక్ష్యంగా చేపట్టిన 100 ఫీట్ల సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను ఈరోజు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు.

Miryalaguda : ఈదులగూడ జంక్షన్ వద్ద 100 ఫీట్ల సిమెంట్ రోడ్డు.. నిర్మాణ పనులకు శ్రీకారం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ పట్టణంలోని ఇదులగూడ జంక్షన్ వద్ద ప్రజలకు రాకపోకల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా, ప్రధాన రహదారిపై సురక్షితంగా ప్రయాణించేలా ప్రమాదాల నివారణ లక్ష్యంగా చేపట్టిన 100 ఫీట్ల సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను ఈరోజు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బి ఎల్ ఆర్ మాట్లాడుతూ.. పట్టణ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంతో పాటు, ట్రాఫిక్ సమస్యలను తగ్గించి ప్రమాదాల నివారణకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
Also Read : అమెరికాలో నల్గొండ యువతి అదృశ్యం.. ఫోన్లో పరామర్శించిన కేటీఆర్..!
ఈదులగూడ జంక్షన్ వద్ద 100 ఫీట్ల సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తయితే పట్టణం నుంచి ప్రధాన రహదారిపైకి వెళ్లే వాహనదారులకు, ప్రజలకు మరింత సౌకర్యవంతమైన రాకపోకలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.









