Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

Miryalaguda : 80 ఏళ్లుగా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికై పోరాడుతున్న ఏకైక సంఘం

గత 80 సంవత్సరాలుగా ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం, వారి సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం నిబద్ధతతో పోరాడుతున్న ఏకైక సంఘం ఎస్ టి యు అని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్ స్పష్టం చేశారు.

Miryalaguda : 80 ఏళ్లుగా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికై పోరాడుతున్న ఏకైక సంఘం

STU రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్

మిర్యాలగూడ, మన సాక్షి :

గత 80 సంవత్సరాలుగా ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం, వారి సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం నిబద్ధతతో పోరాడుతున్న ఏకైక సంఘం ఎస్ టి యు అని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్ స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లాలో నిర్వహించనున్న సంఘ సమావేశానికి వెళ్తూ, మార్గమధ్యలో మిర్యాలగూడలో ఆయన కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చి, నేడు కనీసం పిఆర్సి, డిఏ బకాయిలను కూడా చెల్లించకపోవడం అత్యంత శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే నూతన పిఆర్సిని ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న డిఏ బకాయిలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Also Read : సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల లో ఘోర ప్రమాదం.. భర్త కళ్ళ ఎదుటే భార్య మృతి..!

అలాగే సీపీఎస్ పరిధిలో ఉన్న ఉపాధ్యాయులందరికీ పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఏ ఐ ఎస్ టి ఎఫ్ జాతీయ కౌన్సిల్ మెంబర్ కొనకంచి వీర రాఘవులు, ఎస్ టి యు టి ఎస్ నాయకులు అంబటి వీర నారాయణ, కొనకంచి వెంకటేశ్వర్లు, అంగోతు తావుర్య, రమావత్ రామ్ సింగ్, రమావత్ లాలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు