మదనపల్లెలో భారీ అగ్ని ప్రమాదం.. హోటల్ దగ్ధం..!
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ వద్ద ఉన్న న్యూ తాజ్ హోటల్లో బుధవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.

మదనపల్లెలో భారీ అగ్ని ప్రమాదం.. హోటల్ దగ్ధం..!
( మదనపల్లి – రాజు )
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ వద్ద ఉన్న న్యూ తాజ్ హోటల్లో బుధవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో హోటల్లోని ఫర్నిచర్, వంట పాత్రలు, ఇతర సామగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి శ్రీరామ్ చినబాబు సోదరుడు, దివ్యశ్రీ సిల్క్స్ ఎండీ గుండ్లపల్లి యోగేశ్వర్ బాబు, టౌన్ ప్రెసిడెంట్ అరుణ్ తేజ్, 46వ వార్డు కౌన్సిలర్ ప్రభు గౌడ్, ప్రణయ్ గురువారం న్యూ తాజ్ హోటల్‌ను సందర్శించారు.
Also Read : సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల లో ఘోర ప్రమాదం.. భర్త కళ్ళ ఎదుటే భార్య మృతి..!
అగ్నిప్రమాదం జరిగిన తీరును పరిశీలించి, హోటల్ యజమాని రాష్ట్ర ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్, పార్లమెంటరీ జనరల్ సెక్రటరీ పఠాన్ ఖాదర్ ఖాన్‌ను పరామర్శించారు.
ఈ సందర్భంగా ప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టంపై వివరాలు అడిగి తెలుసుకుని, బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఇలాంటి విపత్కర సమయంలో అండగా ఉంటామని భరోసా కల్పించారు.
కాగా, ప్రమాద సమాచారం అందిన వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడంతో చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా పెను ప్రమాదం తప్పింది.









