Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

ఎప్పుడు ఎన్నికలు వస్తాయా.. కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేద్దామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు..!

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాటల గారడీలతో కాలయాపన చేస్తోందని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ విమర్శించారు.

ఎప్పుడు ఎన్నికలు వస్తాయా.. కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేద్దామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు..!

దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాటల గారడీలతో కాలయాపన చేస్తోందని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ విమర్శించారు. సోమవారం దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గుడిపల్లి మండలం కేశంనేనిపల్లి గ్రామానికి చెందిన 20కుటుంబాలు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..అడ్డమైన హామీలు, అసత్య ప్రచారాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగాలు, విమర్శలు పక్కనపెట్టి ముందుగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో తెలంగాణ రైతాంగం సగౌరవంగా జీవించిందని రవీంద్ర కుమార్ గుర్తుచేశారు. 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్, పుష్కలంగా సాగునీరు, సకాలంలో యూరియా, ఎరువుల పంపిణీ, పంట వేయగానే రైతుబంధు సాయం, ధాన్యం కొనుగోళ్లలో పకడ్బందీ వ్యవస్థతో రైతులకు అండగా నిలిచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని పేర్కొన్నారు.

అయితే ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఆ వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని విమర్శించారు.రాష్ట్రంలో విద్యుత్ సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సాగునీరు అందక, యూరియా సకాలంలో దొరక్క, పండించిన ధాన్యాన్ని విక్రయించుకోలేక రైతులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని అన్నారు. రైతులకు సాగునీరు, నాణ్యమైన విద్యుత్, ఎరువులు అందించడంతో పాటు రైతు సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని కోరారు.

Also Read : హామీ ఇచ్చిన ఉద్యోగాలేవీ..? బిఆర్ఎస్ వినూత్న నిరసన..!

ప్రభుత్వ మెడలు వంచి కేసీఆర్ హయాంలో అమలైన రైతు సంక్షేమాన్ని తిరిగి సాధించుకునేందుకే బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనల్లో చేస్తున్న ప్రసంగాలు, సునామీలు సృష్టిస్తామంటూ చేస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ.. రూ.50 లక్షల లంచం ఇస్తూ పట్టుబడి జైలుకు వెళ్లింది ఎవరో, అసలైన కేడీ ఎవరో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసని ఘాటుగా వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలను పరిష్కరించకుండా ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం సరికాదని, డొల్ల ప్రసంగాలతో ప్రజలను మభ్యపెట్టలేరని అన్నారు. రైతుల కడుపు మండితే ఉవ్వెత్తున ఎగిసిపడే ఆగ్రహ సునామీలో కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని హెచ్చరించారు.

యూత్ డిక్లరేషన్ పేరుతో విద్యార్థులు, నిరుద్యోగులు, యువతీ యువకులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ధనబలాన్ని నమ్ముకుందని, యువత మాత్రం తమ సమస్యలను, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా తమ అభిప్రాయాన్ని ఓటు ద్వారా వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు.రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ప్రజా సంక్షేమం కంటే దోపిడీ పాలనకే ప్రాధాన్యత ఇస్తున్నారనే భావన ప్రజల్లో నెలకొందని ఆరోపించారు.

కాంగ్రెస్ చేతిలో మోసపోయామని భావిస్తున్న ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి, రైతు సంక్షేమం మళ్లీ పూర్వ వైభవం పొందాలంటే కేసీఆర్ నాయకత్వం అవసరమని, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా.. కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేసి తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుందామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని రమావత్ రవీంద్ర కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు వెల్లుగురి వల్లపు రెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ అర్వపల్లి నర్సింహ,సర్పంచులు కూన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి, రైనబోయిన శ్రీను, దూదిపాల రాజేందర్ రెడ్డి, తోటకూరి పరమేష్, ఎర్ర యాదగిరి,బొడ్డుపల్లి మహేందర్, బొగది కృష్ణా రెడ్డి,అనిల్,తదితరులు పాల్గొన్నారు.

పార్టీలో చేరిన వారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రమావత్ రవి,మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు రమావత్ యాదగిరి, వార్డు సభ్యులు రమావత్ నాగు, జటావత్ అచ్చి,రమావత్ హనుమంత్, కాంగ్రెస్ నాయకులు రామావత్ భగవాన్,భాస్కర్, అనిల్, బాల్ సింగ్,రమేష్, మూడవతు రెడ్డి, రమావత్ రమేష్,వెంకట్రామ్, దేవ్ సింగ్, బాలు నాయక్,బిక్షం, మోతిలాల్, దానవత్ సాంబ,రమావత్ ముఖేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు