Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్

మహిళకు రూ.50 వేలు ఆశ చూపి దాడి.. బంగారం లాక్కెళ్లిన వైనం..! 

ఆర్మూర్ పట్టణ పరిధిలో డబ్బు ఆశ చూపి ఓ మహిళపై దాడి చేసి, తులంన్నర బంగారం లాక్కెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది.

మహిళకు రూ.50 వేలు ఆశ చూపి దాడి.. బంగారం లాక్కెళ్లిన వైనం..! 

(ఆర్మూర్, మన సాక్షి – చిరంజీవి)

ఆర్మూర్ పట్టణ పరిధిలో డబ్బు ఆశ చూపి ఓ మహిళపై దాడి చేసి, తులంన్నర బంగారం లాక్కెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలు గంగాగీత తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్‌కు చెందిన మహబూబ్,అన్వీర్‌లు రూ.50 వేలు ఇస్తామని చెప్పి ఆమెను మధ్యాహ్నం సమయంలో ప్లాట్ల ప్రాంతానికి పిలిపించారు.ఆ తర్వాత నసీమ్ అనే మహిళతో కలిసి ఇంటికి తాళం వేసి, తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించారు.

ఈ దాడి సమయంలో తన మెడలోని తులంన్నర బంగారు గొలుసును బలవంతంగా లాక్కెళ్లినట్లు ఆమె వాపోయారు.ఈ ఘటనపై బాల్కొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళితే పోలీసులు తన పట్ల నిర్లక్ష్యంగా, అవమానకరంగా వ్యవహరించారని బాధితురాలు ఆరోపించారు. స్టేషన్‌లో కులం పేరు అడిగి కించపరిచారని, నిందితులకు అనుకూలంగా వ్యవహరించి తనకు న్యాయం చేయలేదని వాపోయారు.

న్యాయం కోసం ఏసీపీని ఆశ్రయించినా ఇప్పటివరకు తగిన స్పందన రాలేదని, గత పదిహేను రోజులుగా న్యాయం కోసం తిరుగుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన ఘటనపై కుటుంబ సభ్యులకు తెలిస్తే తీవ్ర పరిణామాలుంటాయని, తనకు తక్షణమే న్యాయం చేసి ఆదుకోవాలని ఆమె వేడుకుంటున్నారు.

మరిన్ని వార్తలు