Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
lifestyleBreaking NewsTOP STORIES

ప్రొటీన్ అవగాహనపైనే దక్షిణాది డెయిరీ రంగం భవిష్యత్.. సరికొత్త దిశగా పాల ఉత్పత్తుల పరిశ్రమ!

పాలు, మార్కెట్ వాటా , పంపిణీ పరిధి ఆధారంగానే ఇప్పటివరకు తన వ్యాపార ప్రభావాన్ని అంచనా వేసుకుంటూ వచ్చిన డెయిరీ పరిశ్రమలో ఇప్పుడు సరికొత్త ఆలోచనా విధానం వెలుగు చూస్తోంది.

పాలు, మార్కెట్ వాటా , పంపిణీ పరిధి ఆధారంగానే ఇప్పటివరకు తన వ్యాపార ప్రభావాన్ని అంచనా వేసుకుంటూ వచ్చిన డెయిరీ పరిశ్రమలో ఇప్పుడు సరికొత్త ఆలోచనా విధానం వెలుగు చూస్తోంది. కేవలం డెయిరీ ఉత్పత్తులను విక్రయించడం మాత్రమే కాకుండా, వినియోగదారులు తీసుకుంటున్న పాలు, పెరుగు , పన్నీర్ వంటి ఆహార పదార్థాలు వారి శరీరానికి ఎంతటి పోషక విలువలను అందిస్తున్నాయనే అంశంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. దైనందిన జీవితంలో పెరుగు అన్నం, మజ్జిగను భాగం చేసుకున్న దక్షిణాది రాష్ట్రాలు ఈ పరిణామానికి అత్యంత అనుకూల వేదికగా నిలుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తదితర ప్రాంతాల్లో ప్రతి నలుగురు పెద్దలలో ముగ్గురు నిత్యం పాలు లేదా పెరుగును ఆహారంలో ఉపయోగిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఈ వినియోగం సగానికంటే తక్కువగా ఉండగా, దేశవ్యాప్తంగా తలసరి సరాసరి వినియోగం ఏడాదికి 2.8 కిలోలుగా ఉన్నప్పటికీ, దక్షిణాదిలో మాత్రం ప్యాక్ చేసిన పెరుగు వినియోగం ఏకంగా 4.2 కిలోలుగా నమోదవుతూ సరికొత్త రికార్డు సృష్టిస్తోంది.

అయితే, ఈ విసృ్తతమైన వినియోగ సరళికి తగినట్లుగా ప్రజల్లో ప్రొటీన్ పై తగినంత అవగాహన మాత్రం ఇంకా పూర్తిగా వేళ్లూనుకోలేదు. పట్టణ ప్రాంతాల్లో నివసించే ఆరుగురు భారతీయుల్లో నలుగురు ప్రతిరోజూ ప్రొటీన్ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవడంలో విఫలమవుతున్నారని, అలాగే ముగ్గురిలో నలుగురికి తమ శరీర బరువుకు తగినట్లుగా ఎంత ప్రొటీన్ అవసరమనే కచ్చితమైన స్పష్టత లేదని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణ ఆరోగ్యకరమైన వయోజనులు తమ శరీర బరువులో ప్రతి కేజీకి 0.66 నుండి 0.83 గ్రాముల వరకు ప్రొటీన్‌ను తీసుకోవాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో, దక్షిణాది డెయిరీ రంగం అత్యంత వేగంగా లాభసాటి వృద్ధిని నమోదు చేయడమే కాకుండా, ప్రొటీన్ ఆధారిత ఆహార ఉత్పత్తులకు దేశంలోనే అత్యంత కీలకమైన , అతిపెద్ద మార్కెట్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

ఈ మార్పుపై గోద్రెజ్ జెర్సీ సీఈఓ గౌరవ్ పాండే తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ, దక్షిణాది ప్రజలకు డెయిరీ ఉత్పత్తుల ప్రాముఖ్యతను కొత్తగా వివరించాల్సిన అవసరం లేదని, ఎందుకంటే ఇది ఇప్పటికే ప్రతి ఇంటి వంటగది సంస్కృతిలో అంతర్భాగమైందని తెలిపారు. కానీ, వినియోగదారులు తాము నిత్యం సేవించే పెరుగు, పన్నీర్ వంటి పదార్థాలలో లభించే ప్రొటీన్ విలువలను శాస్త్రీయంగా గుర్తించేలా చైతన్యం తేవడమే డెయిరీ పరిశ్రమకు ప్రస్తుతం అత్యంత కీలకమైన బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ఉదాహరణకు, డిజిటల్ యుగంలో జీవించే ఒక బెంగళూరు నగర ఉద్యోగి ఫిట్‌నెస్ యాప్‌ల ద్వారా తాను తీసుకునే ప్రతి క్యాలరీని, ప్రొటీన్‌ను కచ్చితంగా లెక్కగట్టగలడని, కానీ నిత్యం భోజనంలో ఆరగించే ఒక గిన్నె పెరుగులోని ప్రొటీన్ శాతాన్ని మాత్రం లెక్కలోకి తీసుకోవడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ లోపాన్ని సరిదిద్ది, వినియోగదారుల్లో అవగాహన పెంచేలా ముందడుగు వేసే ఏకైక డెయిరీ వ్యాపార విధానం భవిష్యత్తులో దేశం మొత్తానికి ఒక దిశానిర్దేశం చేస్తుందని నిపుణులు గట్టిగా విశ్వసిస్తున్నారు.

మరిన్ని వార్తలు