Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Uncategorized

జాజాపూర్ సమీపంలోనే పులి సంచారం.. మేకల కాపరిని చంపిన పులి..!

నారాయణపేట మండల పరిధిలోని జాజాపూర్ గ్రామ వార్డులో గత రెండు రోజుల నుంచి పులి సంచరిస్తుందని వదినమ్మ ప్రజలు గుసగుసలాడుతున్నారు.

జాజాపూర్ సమీపంలోనే పులి సంచారం.. మేకల కాపరిని చంపిన పులి..!

(నారాయణపేటపట్టణం, మనసాక్షి : రమాకాంత్)

నారాయణపేట మండల పరిధిలోని జాజాపూర్ గ్రామ వార్డులో గత రెండు రోజుల నుంచి పులి సంచరిస్తుందని వదినమ్మ ప్రజలు గుసగుసలాడుతున్నారు. దీంతో గత రెండు రోజుల క్రితం మేకల కాపరి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు గ్రామంలో ప్రజలు తమ పిల్లలను బయటికి వదిలేందుకు తల్లిదండ్రులు జింకుతున్నారు. పాఠశాల సమీపంలోని అంబా భవాని దేవాలయం దగ్గర పులి సంచరించినట్లు దేవాలయం కమిటీ సభ్యులు చూసి ఫోటోలు గ్రామస్తులకు ఇచ్చారని తెలిపారు.

గ్రామంలోని వాగులో గత మూడు రోజుల నుండి పులి సంచరించడంతో అటువైపు ఉన్న రైతు పొలాలలో ఆ రైతులు ఆ పొలాలకు రాత్రి వేళలో వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని ఆ రైతులు తెలిపారు. పులి సంచరించడంతో పలువురు గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వాగులోని ప్రాంతాలను తూతూ మంత్రంగా ప్రాంతాలను సందర్శించి తిరిగి వాళ్ళ కార్యాలయాలకు వెళ్లిపోయారని గ్రామస్తులు తెలిపారు.

దీంతో ప్రతినిత్యం ఆ ప్రాంతాలలోని వ్యవసాయ రైతులు రాత్రి వేళలో పొలాలకు నీళ్లు పెట్టేందుకు వెళ్లాలంటే తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి దాపురించిందని తెలిపారు. దీంతో ఆ రైతుల కుటుంబాలలో కూడా సభ్యులు ఆందోళన చెందుతున్నారు.ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు స్పందించి గ్రామంలో తిరుగుతున్న పులిని బంధించి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిందిగా ఆ చుట్టుపక్కల రైతులతో పాటు గ్రామంలోని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు