మూడు రోజులైనా దొరకని బాలుడి ఆచూకీ – latest news
మూడు రోజులైనా దొరకని బాలుడి ఆచూకీ
క్వారీ గుంతలో ఎన్ డీ అర్ఎఫ్ బృందాల
రంగారెడ్డి జిల్లా కొత్తూర్, మనసాక్షి : ఇన్నుల్ నర్వ గ్రామ శివారులోని ప్రభుత్వ స్థలంలోనూ సర్వే నంబర్ 254 లో కొందరు ప్రైవేట్ వ్యక్తులు లీజుకు తీసుకున్నారు. మైనింగ్ గ్రనేట్స్ త్రవ్వకాలు జరిపారు. చాలా లోతుగా త్రవ్వకాలు జరిపి గుంతలు పుడ్చలేదు.
ALSO READ : వ్యవసాయ బావిలో పడిన కారు, ఒకరు మృతి – latest news
చదువుకుంటూ తండ్రికి సహాయంగా మేకలు కాస్తున్న చందు ( 16) అనే బాలుడు మూడు రోజుల క్రితం గ్రామ శివారులోని క్వారీ దగ్గరికి వెళ్ళి కాలుజారి క్వారీలోని నీటిలో పడిపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు, ఘటన ప్రాంతానికి ఎన్ డిఆర్ఎఫ్ బలగాలు చేరుకొని యువకుడి కోసం గాలిస్తున్నారు.
ALSO READ : వ్యవసాయ బావిలో పడిన కారు, ఒకరు మృతి – latest news
కానీ ఇప్పటి వరకు బాలుడు ఆచూకీ లభించలేదు. ఆక్సిజన్ పరికరాలు ధరించి వెళ్ళినా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబం రోదనలు మిన్నంటాయి.










