Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలు

District Collector : సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి.. జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్..!

District Collector : సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి.. జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్..!

జగిత్యాల, (మన సాక్షి)

జిల్లాలో నిర్వహించనున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ను అధికారులందరూ ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు. బుధవారం రోజున జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ప్రజా పరిషత్ కార్యాలయం లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రభుత్వం ప్రతిష్మాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే పై అంగన్వాడీ, ఆశ వర్కర్, పంచాయతీ సెక్రటరీలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ యజమాని ఇంట్లో వారి వివరాలు పక్కాగా నమోదు చేయాలని, గ్రామాల్లో అధికారులు ఇచ్చిన మ్యాప్ ఆధారితంగా నాలుగు జోన్లుగా విభజించి, అధికారులు సమన్వయంతో సమగ్ర కుటుంబ సర్వే పక్కాగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి ఒక్క ఆఫీసర్ 150 నుండి 200 వరకు ప్రతిరోజు ఇంటింటికి తిరుగుతూ వివరాలను సేకరించాలని సర్వే అయిన ప్రతి ఇంటికి ఖచ్చితంగా స్టిక్కర్ అతికించాలని తెలిపారు. నవంబర్ 1 తేదీ ఉదయం నుండి ప్రతి ఒక్కరు గ్రౌండ్ లెవెల్లో సర్వేని ప్రారంభించాలని ఆదేశించారు.

సమగ్ర కుటుంబ దరఖాస్తు పత్రంలో 56 ప్రశ్నలతో కూడిన పత్రం ఉంటుందని, కావున దీనికి ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇచ్చిన బుక్లెట్ ఆధారంగా కోడ్ పద్ధతిలో కుటుంబ నిర్ధారణ వివరాలు నమోదు చేయాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. సీరియల్ నెంబర్ ఆధారితంగా గ్రామంలోని వార్డును, ఏరియాను ఎంపిక చేసుకొని నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.

సర్వే చేస్తున్న సమయంలో కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు, రేషన్ కార్డు ధరణి పాస్ పుస్తకాలు కుటుంబం దగ్గర ఉంచుకునేలా ప్రచారం చేయాలని అన్నారు. ఎన్యుమరేషన్ సమయంలో కుటుంబం యజమానికి వారి వద్ద నుంచి సేకరించే సమాచారం గోప్యంగా ఉంచబడుతుందని తెలియజేయాలని, నింపిన షెడ్యూల్ ఫారంలోని జాగ్రత్తగా భద్రపరచాలని, ఈ డేటా ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకూడదని తెలిపారు.

రోజువారి సర్వే నివేదికను జిల్లా వారీగా ఏరోజుకారోజు సాయంత్రం 6 గంటలకు తెలియజేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్, తహసిల్దార్, ఎంపీడీవో, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు