అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ
అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ
మర్రిగూడ సెప్టెంబర్ 24 మన సాక్షి:
మర్రిగూడ మండల కేంద్రంలోని సరం పేట గ్రామపంచాయతీ పరిధిలోని గర్షగడ్డలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో ఏర్పాటుచేసిన డా. బి ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మరియు రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద రజిని సాయిచంద్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్-3 ద్వారానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సహకారం అయిందన్నారు. ఆయన ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా కెసిఆర్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ కు కూడా డాక్టర్ అంబేద్కర్ పేరు పెట్టారని పేర్కొన్నారు.
సందర్భంగా రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద రజిని సాయిచంద్ మాట్లాడుతూ హైదరాబాద్ నడిబొడ్డున రాష్ట్ర ప్రభుత్వం 125 అడుగుల భారీ విగ్రహాన్ని నిర్మించడం కారణమని అన్నారు. రానున్న రోజులలో అంబేద్కర్ విగ్రహం నాన్న శిఖరంగా విరాజిల్లుతుందని పేర్కొన్నారు. దళితులకు ఆర్థిక స్వతంత్ర సాధించడానికి దళిత బంధు పథకం అని చెప్పారు.
ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం పేద ప్రజలను ఆదుకునేవే అన్నారు. ప్రజల కోసమే సాయి చందు ఆటపాట ఉండేదని. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పేద ప్రజల సంక్షేమ కోసం కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెనిమల్ల వెంకటమ్మ మధుకర్. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దంటు జగదీష్. సమితి మండల కన్వీనర్ బచ్చు రామకృష్ణ. దళిత బంధు డైరెక్టర్ లప్పంగి నరసింహ. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవీందర్. అధికార ప్రతినిధి గురుపాదం. రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు చిక్కుడు గుండాలు. మహిళా అధ్యక్షురాలు గాజుల పున్నమ్మ. ఆర్ఎస్ మండల అధ్యక్షులు తోటకూరి శంకర్ యాదవ్. గ్రామ శాఖ అధ్యక్షుడు వర్కాల వెంకటేష్. నాయకులు వెంకటయ్య గౌడ్. నరసింహ. సంగెపు గిరి నేత. విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ALSO READ : Ts Rtc : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ దసరా కానుక.. టికెట్ పై రాయితీ, ఎప్పటినుంచంటే..!









