లంచం తీసుకుంటూ ఘట్కేసర్ సబ్ రిజిస్ట్రార్ అరెస్ట్
లంచం తీసుకుంటూ
ఘట్కేసర్ సబ్ రిజిస్ట్రార్ అరెస్ట్
హైదరాబాద్ : హైదరాబాదులోని ఘట్కేసర్ సబ్ రిజిస్ట్రార్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. రూ. 70,000 లంచం తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ సీతారాం రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు చిక్కాడు.
ఘట్కేసర్ మండలం లోని అవుషాపూర్ గ్రామంలో గ్రామ కంఠానికి చెందిన రెండు ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు రిజిస్ట్రార్ సీతారాం లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బాధితుడు సుదర్శన్ ఏసీబీని ఆశ్రయించగా, ఘట్కేసర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. లంచం తీసుకుంటుండగా సబ్ రిజిస్ట్రార్ సీతారాం, అసిస్టెంట్ కిశోర్ లను అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి అడిషనల్ స్పెషల్ జడ్జి ఎదుట హాజరుపరిచినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. సీతారాం నివాసం, కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. భారీగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఇవి కూడా చదవండి :
1. దుబాయిలో భారతీయుడికి రూ. 2 కోట్లు దొరికితే.. ఏం చేశాడంటే ?








