మిర్యాలగూడ : రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ఏం చేశారంటే..?

మిర్యాలగూడ : రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ఏం చేశారంటే..?

మిర్యాలగూడ, మనసాక్షి :

నల్గొండ జిల్లాలోని కోదాడ – జడ్చర్ల హైవేపై యాక్సిడెంట్ జోన్ ను అధికారులు పోలీసులు పరిశీలించారు. నల్గొండ జిల్లా ఎస్ పి అపూర్వరావు ఆదేశానుసారం రోడ్డు ప్రమాదాలు నివారించుటకు గాను అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే యాక్సిడెంట్ జోన్ ఏరియాలను మిర్యాలగూడ రూరల్ సిఐ సత్యనారాయణ, రూరల్ ఎస్సై నరసింహులు పరిశీలించారు .

 

నామ్ రోడ్డు , ఎన్ హెచ్ 167 పై గుర్తించి ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్ గ్రామం కే సి ఫంక్షన్ హాల్ దగ్గర సంబంధిత రోడ్డు హైవే అథారిటీ వారితో, నేషనల్ హైవే ఏఈ తో అట్టి ప్రదేశాలను సందర్శించారు.

 

అక్కడ రోడ్డు పక్కన ఉన్న చెట్లను తొలగించి మరియు ఆ ప్రదేశంలో బోలాడ్స్ మరియు రంబుల్ స్టిక్స్ ఏర్పాటు చేసే విధంగా రూరల్ సిఐ , ఏఈ కృషి చేయనైనది . అదే విధంగా గూడూరు , కొత్తగూడెంలో వద్ద మెయిన్ జంక్షన్ లలో లైటింగ్ మరియు రంబుల్ స్ట్రిప్స్ బోలాడ్స్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడం గురించి కసరత్తు ప్రారంభం చేయనైనది.

 

ఈ కార్యక్రమంలో సెక్యూరిటీ ఆఫీసర్ రాజు , మహమ్మద్, సురేందర్ రెడ్డి లు పాల్గొన్నారు.