District Collector : మాన్యువల్ స్కావెంజర్ రహిత జిల్లాగా ప్రకటన..!
District Collector : మాన్యువల్ స్కావెంజర్ రహిత జిల్లాగా ప్రకటన..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
జిల్లాను మాన్యువల్ స్కావెంజర్ రహిత జిల్లాగా ప్రకటించడం జరిగిందని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సుప్రీం కోర్ట్ ఉత్తర్వుల ప్రకారం మాన్యువల్ స్కావెంజర్స్ జిల్లా స్ధాయి సర్వే కమిటీ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో ఈనెల 1న నిర్వహించడం జరిగింది.
ఈ కమిటీ విధి విధానాలకు సంబంధించి గ్రామ, మున్సిపాలిటీ స్థాయిలలో, రైల్వే మొదలగు సంస్థలలో సర్వే నిర్వహించడం జరిగిందన్నారు. పూర్తి స్థాయి నివేధిక ఈనెల 14 వరకు తయారుచేయబడిందనీ, అయితే అ నివేధికలో నారాయణపేట్ జిల్లా నందు మాన్యువల్ స్కావెంజింగ్ పని ఎక్కడ కూడా చేయటం లేదని పేర్కొనడం జరిగింధి. అయితే ప్రభుత్వ ఆధేశాల మేరకు 14 నుండి 28 వరకు సెల్ఫ్ డిక్లరేషన్ కు సమయం ఇవ్వడము జరిగిందన్నారు.
అయితే ఎవరు కూడా మేము మాన్యువల్ స్కావెంజింగ్ ఇంకా చేస్తున్నాము అని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ది శాఖకు ఎవరు ఫిర్యాదు చేయలేదన్నారు. కావున నారాయణపేట్ జిల్లాను మాన్యువల్ స్కావెంజింగ్ రహిత జిల్లాగా ప్రకటించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
MOST READ :
-
Civils Rank : స్మార్ట్ ఫోన్ ముట్టుకోకుండా సివిల్స్ లో ర్యాంక్ సాధించిన శివాని.. RTC ఎండీ సజ్జనర్ సన్మానం..!
-
UPI : గూగుల్ పే, ఫోన్ పే లావాదేవీల్లో కొత్త రూల్స్ వచ్చేశాయి.. పేమెంట్స్ ఫెయిల్ అయితే..!
-
Miryalaguda : మిర్యాలగూడలో 118 వాహనాలు, 220 లీటర్ల మద్యం సీజ్.. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడి..!
-
TG News : రైతులకు శుభవార్త.. వారి ఖాతాలలో డబ్బులు జమ..!
-
Suryapet : మా పిల్లల్ని మాకు ఇప్పించండి.. లేకుంటే ఆత్మహత్యలు శరణ్యం.. పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..!









