Almatti : ఆలమట్టి డ్యాంకు కొనసాగుతున్న వరద..!
కర్ణాటకలోని ఆలమట్టి డ్యాంకు ఎగువ నుంచి వస్తున్న వరద కొనసాగుతుంది. ఆదివారం ఒక్కరోజే అలమట్టి డ్యాంకు 12 టీఎంసీల నీరు చేరింది.

Almatti : ఆలమట్టి డ్యాంకు కొనసాగుతున్న వరద..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
కర్ణాటకలోని ఆలమట్టి డ్యాంకు ఎగువ నుంచి వస్తున్న వరద కొనసాగుతుంది. ఆదివారం ఒక్కరోజే అలమట్టి డ్యాంకు 12 టీఎంసీల నీరు చేరింది. ప్రస్తుతం ఒక లక్ష 31 వేల 940 కుసేక్కుల వరద నీరు ఇన్ ఫ్లో వస్తుంది. ప్రస్తుతం ఆలమట్టి డ్యామ్ లో 86.061 టిఎంసిల నీరు ఉండగా.. డ్యామ్ పూర్తి స్తాయి డ్యాం సామర్థ్యం 123 టీ ఎం సి లు. కాగా దిగువకు కేవలం 483 కుసేక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు.
మహారాష్ట్రలో వర్షాలు తగ్గుముఖం పట్టడం వల్ల సోమవారం సాయంత్రం వరకు వరద మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా తుంగభద్ర జలాశయానికి కూడా వరద నీరు తగుముఖం పట్టింది. శనివారం 38వేల 976 కుసేక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా ఆదివారానికి 25,120 క్యూసెక్కులకు పడిపోయింది. జలాశయ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా ప్రస్తుతం 22.948 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది.
ఆలమట్టి దిగువన ఉన్న నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులకు ప్రవాహం లేదు. దాంతో శ్రీశైలంలోకి చుక్క నీరు కూడా రావడం లేదు. నాగార్జునసాగర్ లోకి కూడా చుక్క నీరు రావడం లేదు. ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయంలో 138.03 టీ ఎం సి ల నీరు ఉంది. పులిచింతల ప్రాజెక్టులో 30.99 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
MOST READ :
- Snacks : ఆరోగ్యంగా ఉండాలంటే ఈవెనింగ్ స్నాక్స్ ఏ టైమ్ లో ఏవి తినాలి, తినకూడనివి ఏంటి.. తెలుసుకుందాం..!
- Ration Shops : రేషన్ దుకాణాల్లో ముక్కిపోతున్న బియ్యం.. ఎందుకు ఈ పరిస్థితి..!
- Big Alert : రైతులకు బిగ్ అలర్ట్.. సన్న వడ్ల బోనస్ పై ప్రభుత్వం స్పెషల్ గైడ్ లైన్స్..!
- 30 ఏళ్ల నమ్మకం.. రూ.50 కోట్లతో పరార్.. నిండా ముంచిన సిమెంట్ వ్యాపారి..!









