క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ
Play Cards : అందర్, బాహర్.. పేకాట రాయుళ్ల అరెస్ట్..!
Play Cards : అందర్, బాహర్.. పేకాట రాయుళ్ల అరెస్ట్..!
మిర్యాలగూడ, మన సాక్షి :
అందర్, బాహర్ పేకాట ఆడుతుండగా ఐదు మందిని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మిర్యాలగూడ మండలం జంకు తండా శివారులోని ఇండస్ట్రియల్ ఏరియాలో గల ఖాళీ ప్రదేశంలో కొంతమంది పేకాట ఆడుతున్నారనే సమాచారం వచ్చింది.
వెళ్లి చూడగా ఐదు మంది వ్యక్తులు డబ్బులు పెట్టుకుని అందర్ బహార్ పేకాట ఆడుతుండగా పట్టుబడి చేసి వారు ఆటలో పెట్టుకున్న నగదు 3500 రూపాయలు, నాలుగు సెల్ ఫోన్లు, ప్లే కార్డ్స్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగినది.









