Suryapet : ప్రభుత్వ పాఠశాలలో చదివి మెరిసిన ఆణిముత్యాలు..!
Suryapet : ప్రభుత్వ పాఠశాలలో చదివి మెరిసిన ఆణిముత్యాలు..!
అర్వపల్లి , మన సాక్షి
సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించి అవార్డు అందజేశారు.
మండల కేంద్రానికి చెందిన మేకల శోభ , నాగరాజు, ల కూతురు మహేశ్వరి మరియు చన్నబోయిన ఉపేంద్ర కూతురు, పల్లవి, పదికి పది మార్కులు సాధించి మండల వ్యాప్తంగా మొదటి ర్యాంకులో పాస్ అయినట్లు మండల విద్యాధికారి బి బాల నాయక్ తెలిపారు.
వీరిని పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు చిగుర్ల నరసయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు లింగాల రవికుమార్, మధుకర్ ఆధ్వర్యంలో సన్మానించారు, జిల్లావ్యాప్తంగా పాఠశాలకు మంచి పేరు తెచ్చినందుకు అభినందించారు, అదేవిధంగా మండల కేంద్రానికి చెందిన కుంకుడు పాల, రేణుక రవీందర్, చిన్న కూతురు హిమబిందు పదికి పది మార్కులతో మొదటి స్థానంలో విజయ సాధించినట్లు తెలిపారు. హిమబిందును జిల్లా కలెక్టర్ వెంకట్రావు సన్మానించి అవార్డు అందజేశారు.
ALSO READ :
Ktr : పిరమైన ప్రధాని గారు.. అంటూ తెలంగాణకు వస్తున్న మోడీపై కేటీఆర్ ట్వీట్ మీరే చూడండి..!
WhatsApp : ఇండియాలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయా.. కారణం ఏంటి..?









