Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

అంబేడ్కర్ విదేశీ విద్యానిధి పథకానికి ధరఖాస్తులు ఆహ్వానం..!

అంబేడ్కర్ విదేశీ విద్యానిధి పథకానికి ధరఖాస్తులు ఆహ్వానం..!

నారాయణపేట టౌన్,  మన సాక్షి :

జిల్లా పరిధిలోషెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థినీ-విద్యార్థులు అంబేడ్కర్ విదేశి విద్యానిధికి గాను దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 29 వరకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వము అవకాశం కల్పించినట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కజ్జం ఉమాపతి ఒక ప్రకటనలో తెలిపారు.

మెడిసిన్, ఇంజినీరింగ్, ఫార్మసి, నర్సింగ్, సైన్స్, హుమానటీస్ తదితర కోర్సులు పూర్తిచేసిన వారు పై చదువులు విదేశాలలో చదువకోరే విద్యార్థినీ-విద్యార్థులు ధరఖాస్తులు నేరుగా ఈపాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవా అన్నారు.

దరఖాస్తుదారుల కుటుంబ ఆదాయం 5లక్షలకు మించకుండా ఉండాలని, వయస్సు35సం.లోపు ఉండాలని, ఈ పథకం కుటుంబం లో ఒకరికి మాత్రమే వర్తిస్తుందని అన్నారు. డిగ్రీ పరీక్షలో 60% మార్కులు కలిగి ఉండాలని, గుర్తింపు పొందిన విదేశీ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ పొంది ఉండాలన్నారు.

జి ఆర్ ఈ, జి మ్యాట్ టో ఫెల్, ఐ ఈ ఎల్ టి ఎస్ (GRE,GMAT,TOFEL, IELTS )నందు 60% మార్కులు కలిగిన వారు అర్హులని ఆయన తెలిపారు.పూర్తి వివరాలకు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కార్యాలయంలోసంప్రదించాలని ఆయన కోరారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు