Breaking Newsక్రైంసినిమాహైదరాబాద్

Saif Ali khan : బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడి అరెస్ట్..!

Saif Ali khan : బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడి అరెస్ట్..!

మన సాక్షి, హైదరాబాద్ :

బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. దాడి చేసిన 33 గంటల్లోనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ముంబై బాంద్రా పోలీసులు అతని అరెస్టు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం నిందితుడు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

సైఫ్ అలీ ఖాన్ ఇంటిలోకి అతడు దొంగతనానికి వెళ్ళాడా..? లేదా ఎవరైనా సుపారీ ఇచ్చారా..? మరి ఏదైనా కుట్ర కోణం ఉందా..? అనే విషయంపై పోలీసులు విచారణ చేపడుతున్నట్లు తెలిసింది. ఇది ఇలా ఉండగా తీవ్ర గాయాలతో సైఫ్ అలీ ఖాన్ లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

గురువారం తెల్లవారుజామున హీరో సైఫ్ అలీ ఖాన్ పై దుండగుడు కత్తితో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో నిందితుడు మెట్లు దిగి వెళుతుండగా సీసీ టీవీలో కనిపించింది. బ్యాగ్ తగిలించుకొని స్కార్ఫ్ భుజంపై వేసుకొని కనిపించాడు. నిందితుడి ఫోటోలను సైతం పోలీసులు విడుదల చేశారు.

|MOST READ : 

  1. CM Revanth Reddy : సింగపూర్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఘనంగా తెలుగువారి స్వాగతం..!

  2. Rythu Bharosa : రైతు భరోసా కు అనర్హుల గుర్తింపు.. ప్రారంభమైన క్షేత్రస్థాయి సర్వే..!

  3. ప్రధాని మోదీతో పరీక్షా పే చర్చ లో నల్గొండ విద్యార్థిని..!

  4. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ బ్రేక్..!

  5. Miryalaguda : వ్యవసాయ, రెవెన్యూ అధికారుల జాయింట్ సర్వే.. రైతు భరోసా కు అనర్హుల గుర్తింపు..!

మరిన్ని వార్తలు