మిర్యాలగూడ : ఆశా వర్కర్లకు పారితోషకం 18వేలు ఇవ్వాలి..!
మిర్యాలగూడ : ఆశా వర్కర్లకు పారితోషకం 18వేలు ఇవ్వాలి..!
ఎమ్మెల్యే కార్యాలయం ముందు ధర్నా
మిర్యాలగూడ, మన సాక్షి:
ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని మంగళవారం ఆశా వర్కర్లు ఎమ్మెల్యే కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు తిరుపతి రామ్మూర్తి సిపిఎం జిల్లా నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆశా వర్కర్లతో ప్రభుత్వాలు వెట్టి చాకిరి చేయించుకుంటుందని ఆరోపించారు.

కనీస వేతనం 18వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పనిభారం తగ్గించాలని కోరారు. పారితోషకము లేని అదనపు పనులను ఆశా వర్కర్లతో చేయించకూడదన్నారు. టిబి స్ఫుటము డబ్బాలను ఆశాలతో మోయించకూడదని చెప్పారు. టీబి, లెప్రసి, కంటి వెలుగు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు. జాబ్ కార్డు విడుదల చేయాలన్నారు.
ALSO READ :
- Raksha Bandhan : రక్షా బంధన్ పై సందిగ్ధం.. అదే రోజు భద్రకాలం, ఆ సమయంలో రాఖీ కట్టొద్దు..!
- Tea : టీ తాగేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు.. టీలో అవి కలుపుకొని తింటే..!
- Crime News : కారు బానెట్ పై ఆ డాక్టర్ ను 50 మీటర్లు ఈడ్చుకెళ్లారు.. (వీడియో)
- NTR COIN : ఎన్టీఆర్ చిత్రంతో వంద రూపాయల నాణెం.. నేడు విడుదల.. ముద్రించింది ఎక్కడో తెలుసా..?
పెండింగ్లో ఉన్న ఆరు నెలల పిఆర్సి బిల్లులను వెంటనే చెల్లించాలని, 32 రకాల రిజిస్టర్ లను ప్రభుత్వమే ప్రింట్ చేసి ఇవ్వాలని, ఐదు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న యూనిఫామ్ నాణ్యతతో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతి సెలవులపై సర్కులర్ ను జారీ చేయాలన్నారు.
పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించి వారి న్యాయమైన కోరికలను నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటీయూ నాయకులు దయానంద్, రొండి శ్రీనివాస్, పాపా నాయక్, రామారావు తదితరులు పాల్గొన్నారు.









