BREAKING : ఆటో పల్టీ పదిమందికి గాయాలు

ఆటో పల్టీ పదిమందికి గాయాలు

చింతపల్లి. మన సాక్షి

హైదరాబాద్ నాగార్జునసాగర్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పదిమందికి తీవ్ర గాయాలైన సంఘటన చింతపల్లి మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపి వివరాల ప్రకారం..

 

మదనాపురం గ్రామానికి చెందిన పగడాల పద్మమ్మ పగడాల పోచమ్మ పగడాల మైసమ్మ తాండ్ర శివాని లు వీరితో పాటు మరో ఆరుగురు ప్రయాణికులు మదనాపురం నుండి ఆటోలు బయలుదేరి మాల్ లో జరిగే ఓ వివాహ శుభకార్యానికి హాజరవుతుండగా జయ ఫంక్షన్ హాల్ సమీపంలో ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయి ఆటో పల్టీ కొట్టింది .

దీంతో ఆటో డ్రైవర్ తో సహా నలుగురికి తీవ్ర గాయాలు మరికొందరికి స్వల్ప గాయాలు అయినట్లు బాధితులు పేర్కొన్నారు. ఆటో పల్టిగొట్టి కొందరు తీవ్ర గాయాలైన వారిని 108 ద్వారా హైదరాబాదుకు తరలించగా మరికొందరు మాల్ లోని పీపుల్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

 

.తాండ్ర శివానికి తలకు బలమైన గాయం కావడంతో పరిస్థితి తీవ్రంగా ఉంది. సంఘటన విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాద సంఘటన విషయాన్ని సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆటో డ్రైవర్ కూడా తీవ్ర గాయాలనట్టు బాధితులు పేర్కొన్నారు.