సూర్యాపేట : ఆటోనగర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు 

జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్

సూర్యాపేట : ఆటోనగర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు 

జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్

సూర్యాపేట, మనసాక్షి

జిల్లా అభివృద్ధిలో భాగంగా ఆటోనగర్ ఏర్పాటు కోసం అనుకూలమైన ప్రభుత్వ భూములను పరిశీలిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్ అన్నారు.

 

శనివారం సూర్యాపేట మండలం బాలెంల గ్రామ రెవెన్యూ పరిదిలోని 441 సర్వే లో గల ప్రభుత్వ భూములు , చివ్వెంల మండలం ఐలాపురంలో లోని సర్వే నెంబర్ 169 లో గల ప్రభుత్వ భూములు అలాగే సూర్యాపేట మండలం ఇమాంపేట లో ఉన్న సర్వే నెంబర్ 146 లో గల ప్రభుత్వ భూములను కలెక్టర్ పరిశీలించారు.

 

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా దినదినాభివృద్ది చెందుతున్నందున
మరింత వేగంగా పారిశ్రామిక రంగం కూడా అభివృద్ధి చేసేలా ప్రభుత్వ మార్గదర్శకాల కు లోబడి ప్రభుత్వ భూములను పరిశీలన చేస్తున్నట్లు పేర్కొన్నారు. నీటివనరులు, భూముల అనుకూలత సంబంధిత రెవెన్యూ అధికారులను ద్వారా తెలుసుకున్నారు. ఆటో నగర్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి అందచేయాలని ఆదేశించారు.

 

అనంతరం ఇమామ్ పేటలో ప్రభుత్వ భూముల పరిశీలన అనంతరం మున్సిపల్ ఆధ్వర్యంలో మలవిసర్జనల ద్వారా తయారు చేసే ఎరువుల కేంద్రాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని అధికారులను ఈ సందర్బంగా ఆదేశించారు.

 

ఈ కార్యక్రమంలో ఏడి ల్యాండ్ రికార్డ్స్ నాగేందర్, జి.యం. పరిశ్రమలు తిరుపతయ్య, తహసీల్దార్ వెంకన్న, సర్వేయర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.