ఆటోను ఢీ కొట్టిన ట్రాక్టర్, ఒకరి మృతి , ఐదుగురికి గాయాలు

ఆటోను ఢీ కొట్టిన ట్రాక్టర్, ఒకరి మృతి , ఐదుగురికి గాయాలు

కొమరం భీమ్ ఆసిఫాబాద్. మన సాక్షి :

శుభకార్యానికి వెళ్లి వస్తూ ట్రాక్టర్ ఢీకొనడంతో కాగజ్ నగర్ మండలం ఆరెగూడ గ్రామానికి చెందిన ముద్దసాని శ్రీను( 40) మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది, పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రాజంపేట గ్రామానికి చెందిన శ్రీను ఆరెగూడ గ్రామానికి చెందిన తన మామ ఎంబడి బాగవయ్య కుటుంబ సభ్యులు కన్నెపల్లి మండలంలోని ఎల్లారం పోచమ్మ ఆలయం వద్ద పు వెంట్రుకలు శుభకార్యానికి వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు, సాయంత్రం ఆటోలో అరె గూడ గ్రామానికి వెళుతున్న క్రమంలో కాగజ్ నగర్ కాపు వాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఇస్దాం వైపు నుండి కాగజ్ నగర్ కు వెళుతున్న ట్రాక్టర్ ఎదురుగా వచ్చి ఆటో ముందు భాగానికి ఢీకొట్టడంతో ఆటోలో ముందు కుడి వైపు కూర్చున్న శ్రీను అక్కడికక్కడే మృతి చెందాడు.

 

ఆటోలో ఐదుగురికి తీవ్ర గాయాల పాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు, మృతుడు గత పదేళ్లుగా ద్వారక నగర్లో ఒక ప్రైవేటు బ్రెడ్ కంపెనీలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడని తెలిపారు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇస్గాంఎస్సై జగదీష్ తెలిపారు.

 

ట్రాక్టర్ అతివేగమే కారణమని స్థానికులు పేర్కొన్నారు,
మృతుని కుటుంబీకుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి, తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు మృతదేహంతో రోడ్డుపైన ధర్నా చేపట్టారు.