Chilli : మిర్చికి గడ్డు కాలం.. రైతుల దిగాలు..!
Chilli : మిర్చికి గడ్డు కాలం.. రైతుల దిగాలు..!
రామసముద్రం, మన సాక్షి :
ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం పెద్దకురప్పల్లె తిరుమలరెడ్డిపల్లె గ్రామానికి చెందిన రెడ్డిశేఖర్ తన పొలంలో మిర్చి పంట సాగు చేశారు. మిర్చి ధరలు లేక రైతు బాగా నష్టపోతున్నారు. గత వారం రోజులు గా ధరలు పూర్తిగా పతనమై కూలీ ఖర్చులు కూడ మిగలడం లేదని రైతులు వాపోతున్నారు.
నెల క్రితం కిలో 30 రూపాయలు పలికిన మిర్చి ఇప్పుడు కిలో 15, 18రూపాయలు పలుకడంతో రైతు దిగులు చెందుతున్నారు. రైతు రెడ్డిశేఖర్ మాట్లాడుతూ ఎకరంలో మిర్చి పంట సాగుచేశానని పంట దిగుబడి బాగా వచ్చిందని సాగు కోసం 70, 80వేలు ఖర్చులు వచ్చాయని ఆయన తెలిపారు.
వారానికి ఒక సారి మందులు పిచికారీ చేయాలంటే పదివేలు ఖర్చు వస్తుందని బాగా పంట రావాలంటే కనీసం 5,6 సార్లు మందులు కొట్టాల్సివస్తుందన్నారు. ప్రభుత్వం స్పందించి మిర్చికి గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని రైతు కోరుతున్నారు.
MOST READ :
-
Gold Price : పరుగు పెడుతున్న పసిడి.. మరింత పెరిగిన బంగారం ధర, అదే కారణమా..!
-
Nalgonda : నల్లగొండ డీఈవో బిక్షపతి రాసలీలలు.. భార్య ఆందోళన..!
-
Gold Price : పసిడికి మరోసారి రెక్కలు.. తులం బంగారం ధర ఎంతంటే..!
-
Mana Sakshi Effect : మన సాక్షి కథనానికి స్పందన.. 119 అక్రమ ఇసుక తరలింపు వాహనాల పట్టివేత… జిల్లా కలెక్టర్..!









