శేరిలింగంపల్లి, మాదాపూర్ లో రఘునాథ్ యాదవ్ బస్తీ బాట

శేరిలింగంపల్లి, మాదాపూర్ లో రఘునాథ్ యాదవ్ బస్తీ బాట

శేరిలింగంపల్లి , మనసాక్షి :

శేరిలింగంపల్లి మాదాపూర్ డివిజన్ ఆదిత్య నగర్ రోడ్ నెంబర్ 1 బస్తీ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రఘునాథ్ యాదవ్ సందర్శించారు. బస్తీ ప్రజల బాధలను అడిగి తెలుసుకున్నారు. గత 10సం. నుండి తమ బస్తీనీ పట్టించుకునే వారే లేరని ప్రజలు వాపోయారు. తాగునీటి సమస్య రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని, స్థానిక ఎమ్మెల్యే కార్పోరేటర్ ను పదేళ్లలో ఇంతవరకు ఎప్పుడు చూడలేదని, రెండు నెలల క్రితం స్థానిక బిఆర్ఎస్ లీడర్లు సీసీ రోడ్ల కోసం శంకుస్థాపన చేసి గాలికి వదిలేసారని తెలిపారు.

 

వారి సమస్యలను అధికారులతో మాట్లాడి పునరావృతం కాకుండా చేస్తానని హామీ ఇచ్చారు. మంచినీటి సమస్యపై మంజీర నీటి సరఫరా అదికారులతొ మాట్లాడి నీరు బస్తీలో సరిపోయే విధంగా విడుదల చేయాలని రఘునాథ్ యాదవ్ కోరారు.

 

ALSO READ :

1. మిర్యాలగూడ : విద్యుత్ సమస్యలు ఉంటే, ఫోన్ చేస్తే పరిష్కారం.. ఇవిగో ఫోన్ నెంబర్స్..!

2. Srisailam : శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద.. విద్యుత్ ఉత్పత్తితో దిగువకు నీరు..!

3. వామ్మో మామూలు భార్య కాదు ఆమె : భర్త నల్లగా ఉన్నాడని వేధింపులు.. కోర్టు ఏం చెప్పిందంటే..!

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదిత్య నగర్ బస్తీలో సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయని ప్రజలకు స్థానిక ఎమ్మెల్యే కార్పోరేటర్ ఇంతవరకు చూడలేదంటే వారి పరిపాలన ఏ విధంగా ఉందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి అధికారం ఉన్నా లేకున్నా ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో ఉంటూ మీ ఇంటి మనిషిగా మీ సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ తోడుంటానని హామీ ఇచ్చారు.

 

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి టిఆర్ఎస్ నాయకులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు అమిద్, రషీద్, హసన్, షరీఫ్, భరత్ యాదవ్, రాజేష్ యాదవ్, కిరణ్ రెడ్డి కుమార్ సాగర్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.