బిజెపి అధికారంలోకి వస్తే బిసి ముఖ్యమంత్రి..!

జరగబోయే ఎన్నికల్లో గెలిస్తే టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు గెలుస్తే తెలంగాణ రాష్ట్రానికి ఏమి చేయవని మోడీ నాయకత్వంలోని బిజెపి మాత్రమే ప్రజలకు సేవచేస్తుందిని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన బిజెపి బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.

బిజెపి అధికారంలోకి వస్తే బిసి ముఖ్యమంత్రి..!

కేంద్ర హోంమంత్రి అమిత్ షా

సూర్యాపేట, మనసాక్షి

జరగబోయే ఎన్నికల్లో గెలిస్తే టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు గెలుస్తే తెలంగాణ రాష్ట్రానికి ఏమి చేయవని మోడీ నాయకత్వంలోని బిజెపి మాత్రమే ప్రజలకు సేవచేస్తుందిని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన బిజెపి బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.

టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కుటుంబాల కోసం పనిచేస్తాయని బిజెపి పార్టీ లక్ష్యం పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తాయని టిఆర్ఎస్ కాంగ్రెస్ వారి కుటుంబ సంక్షేమం కోసం పనిచేస్తాయని అన్నారు.
బిఆర్ఎస్ పార్టీ పేద దళిత బీసి వ్యతిరేక పార్టీ అని బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితున్ని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి కెసిఆర్ మాట తప్పరని గుర్తు చేశారు.

పేద దళితులకు మూడెకరాల భూమి ఎటు పోయింది దళితులకు 50 వేల కోట్లతో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తానని చేసావాఅని ప్రశ్నించారు. బీసీల సంక్షేమం కోసం 15,000 కోట్లతో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామన్నారు దానిని ఎందుకు వదిలేసావు బిజెపిని ఆశీర్వదిస్తే తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని హమీ ఇచ్చారు.

ALSO READ : Congress Second List : 45 మందితో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ విడుదల.. ఇవి పేర్లు..!

గిరిజన సంక్షేమం కోసం మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని అందుకే వరంగల్లో సమ్మక్క సారక్క పేరుతో ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్నారు. పసుపు రైతుల కోసం మోడీ పసుపు బోర్డును ఏర్పాటు చేశాడని కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులను మోడీ నెరవేర్చారని అన్నారు. కిసాన్ సమ్మన్ యోజన పథకం కింద రైతులకు 6000 చొప్పున 40 లక్షల మంది రైతులకు తొమ్మిది వేల కోట్లు జమ చేస్తున్నామని చెప్పారు.

పేదలకు నెలకు 5 కిలోల చొప్పున 1,90,000 మందికి ఉచిత బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సంక్షేమానికి లక్షలాది కోట్ల రూపాయలు అందించిన ఘనత కేంద్రములోని మోడీ ప్రభుత్వానిదెనని చెప్పారు. 550 సంవత్సరాల శ్రీ రామ మందిరం కల అయోధ్యలో సాకారం అవుతుందని జనవరిలో నిర్వహించే తొలి పూజకు సూర్యాపేట జిల్లా నుంచి ప్రజలు తరలిరావాలని కోరారు. బిజెపి అభ్యర్థులను గెలిపించి అవినీతి రహిత పాలనకు మార్గం వేయాలని ప్రజలను కోరారు.

ALSO READ : నల్గొండ : బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్.. గుత్తా ముఖ్య అనుచరుడు కాంగ్రెసులో చేరిక..!

ఈ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి ,బిజెపి నాయకులు సంకినేని వెంకటేశ్వరరావు ,కడియం రామచంద్రయ్య, తో పాటు పలువురు రాష్ట్ర, జాతీయ నాయకులు పాల్గొన్నారు.హోంమంత్రి అమిత్ షా ప్రసంగాన్ని కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి తెలుగు లో అనువాదం చేశారు. అమిత్ షా ప్రసంగాన్నీ ప్రారంభించే ముందు పిల్లలమర్రి చెన్నకేశవ స్వామికి నమస్కరించి ఉపన్యాసాన్ని మొదలుపెడతా అని ప్రసంగాన్ని ప్రారంభించారు.

ALSO READ : Google Pay : గూగుల్ పే ఈజీ లోన్ రూ.15000, ఈఎంఐ కేవలం రూ. 111 మాత్రమే..!