రూ. 5 లకే అద్భుతమైన భోజనం , ప్రతి రోజు 500 మందికి 

రూ. 5 లకే అద్భుతమైన భోజనం , ప్రతి రోజు 500 మందికి 

నల్లగొండలో అన్నపూర్ణ క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి

నల్లగొండ ఆగస్టు 9 మన సాక్షి : ఐదు రూపాయలకే ఆరోగ్యకరమైన భోజనాన్ని అందించడంఅభినందనీయమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ పురపాలక సంఘం సౌజన్యంతో ఏర్పాటు చేసిన అన్నపూర్ణ క్యాంటీన్ ను మంగళవారం రోజున నల్లగొండ జిల్లా కేంద్రంలో మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శాసనసభ్యులు కంచర్ల కృష్ణారెడ్డి, యన్. బాస్కర్ రావు,మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, యస్ పి రేమా రాజేశ్వరి, మున్సిపల్ కమిషనర్ రమణాచారి తదితరులుపాల్గొన్నారు.

ALSO READ : BREAKING : వాగులో చిక్కుకున్న ట్రక్కు (వీడియో)
అంతకు ముందు మంత్రి జగదీష్ రెడ్డి జిల్లా కేంద్రంలోనీ ప్రకాశం బజార్ కూడలి లో ఏమిరాల్డ్ పార్క్ ను ప్రారంభించారు. అదే పార్క్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నపూర్ణ క్యాంటీన్ ను ఏర్పాటు చేసి ఐదు రూపాయలకే భోజనం అందించడం సాహసోపేతమైన దని ఆయన పేర్కొన్నారు. ఐదు రూపాయల చొప్పున ప్రతి రోజు ఐదు వందల మందికి అందించనున్న భోజనం ఖర్చు నల్లగొండ పురపాలక సంఘానికి నెల వారిగా 3 లక్షల 23 వేలు అవుతుందన్నారు.ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాలు మినహా మిగతా 26 రోజులు క్యాంటీన్ లో భోజనం అందుబాటులో ఉండేలా నిర్వాహకులు చర్యలు తీసుకున్నారన్నారు.పేదలకు ఇది ఎంతగానో దోహదపడుతుందని ఇటువంటి క్యాంటీన్ ల ద్వారా భోజనం అందిస్తున్న సంస్థను ఆయన అభినందించారు.