Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డిరాజకీయం

BREAKING: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన మరో ఎమ్మెల్యే..! 

BREAKING: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన మరో ఎమ్మెల్యే..! 

చేవెళ్ల, (మన సాక్షి):

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతూ అధినేత కేసీఆర్‌కు వరసగా షాకులిస్తున్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ లో చేరారు.

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్ కూడా హస్తం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఉన్నారు.

ALSO READ : 

BREAKING: తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. ధరణి ఫైళ్ల తనిఖీ..! 

BREAKING : జిల్లా కలెక్టర్ ఉత్తర్వులపై మండిపడ్డ వైద్యులు, సిబ్బంది నిరసన.. సందర్శించిన అదనపు కలెక్టర్..!

మరిన్ని వార్తలు