నల్గొండ : బిజెపి జిల్లా అధ్యక్షునిగా డాక్టర్ వర్షిత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ..!

బిజెపి నల్గొండ జిల్లా అధ్యక్షునిగా డాక్టర్ వర్షిత్ రెడ్డి ఆదివారం బిజెపి జిల్లా కార్యాలయంలో బిజెపి కేంద్ర రాష్ట్రజిల్లా నాయకుల సమక్షంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా కార్యాలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో వివిధ రకాల పూల మాలలతో అందంగా అలంకరించారు.

నల్గొండ : బిజెపి జిల్లా అధ్యక్షునిగా డాక్టర్ వర్షిత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ..!

నల్లగొండ, మనసాక్షి :

బిజెపి నల్గొండ జిల్లా అధ్యక్షునిగా డాక్టర్ వర్షిత్ రెడ్డి ఆదివారం బిజెపి జిల్లా కార్యాలయంలో బిజెపి కేంద్ర రాష్ట్రజిల్లా నాయకుల సమక్షంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా కార్యాలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో వివిధ రకాల పూల మాలలతో అందంగా అలంకరించారు. అలాగే బిజెపి జిల్లా కార్యాలయంలో డాక్టర్ వర్షిత్ రెడ్డి శాస్త్రక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు .

ఈ సందర్భంగా వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనను జిల్లా అధ్యక్షునిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి సహకరించిన జిల్లా నాయకులకు రాష్ట్ర నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. బిజెపి పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తప్పకుండా అవకాశాలు వస్తాయి అనడానికి తానే నిదర్శనం అన్నారు.

ఈ పదవిని తాను బాధ్యతగా స్వీకరిస్తూ పని చేస్తానన్నారు .జిల్లాలోని బూతు స్థాయి కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ అందరినీ కలుపుకొని జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు కార్యక్రమాలను విజయవంతం చేస్తామన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే వరకు పార్టీ నాయకులను కార్యకర్తలను కలుపుకొని ప్రజా పోరాటాలు చేస్తామన్నారు.

ALSO READ : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ, దరఖాస్తుల ఆహ్వానం..!

తనకోసం వచ్చిన ప్రతి కార్యకర్తకు నాయకునికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అందరి ఆశీస్సులు కావాలని అందరి సహకారం కావాలని కోరారు. కార్యకర్త లేనిది వర్షిత్ రెడ్డి లేడని కార్యకర్తల బలమే బిజెపి బలమని కార్యకర్తల కోసం తన తలుపులు ఎప్పుడు తెరిచి ఉంటాయని, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చిన అర్ధరాత్రి అయిన తనను సంప్రదించవట్టన్నారు.

తనపై నమ్మకం ఉంచి తనకు జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టిన పార్టీ నమ్మకాన్ని మమ్ము చేయనని జిల్లాలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తూ బిజెపిని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డిని పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించి అభినందించారు.

ALSO READ : కెసిఆర్ ఎన్నడూ దావోస్..గీవోస్ గురించి పట్టించుకోలేదు, మరి రేవంత్ వెళ్తే జోకులు ఎందుకో చూడండి..!

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు జిల్లా ఇన్చార్జి ప్రదీప్ .రాష్ట్ర కార్యదర్శి మాదాగాని శ్రీనివాస్ గౌడ్. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి. బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు కంకణాలు శ్రీధర్ రెడ్డి. పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్. గోలి మధుసూదన్ రెడ్డి. పూతపాక సాంబయ్య. ముని కుమార్. నాగిరెడ్డి. వెంకటేశ్వర్లు .దాసోజు యాదగిరి చారి .బొజ్జ నాగరాజు. చింత ముత్యాలరావు .బొద్రశేఖర్. లింగస్వామి. బోగారి అనిల్. పల్లె ప్రకాష్ .ఫకీర్ మోహన్ రెడ్డి .శాంతి స్వరూప్ .నరేందర్ రెడ్డి. పాశం శ్రీనివాస్ రెడ్డి. రవికుమార్ .మండల వెంకన్న .నీరజా. కాశమ్మ. తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : సాగర్ లో ఆగని ఎన్ఎస్పి భూమి కబ్జా..!