సాగర్ లో ఆగని ఎన్ఎస్పి భూమి కబ్జా..!

కృష్ణా నది తీరాన నాగార్జునసాగర్ నడిబొడ్డున ఎంతో విలువైన స్థలాన్ని ఎన్ఎస్పి అధికారులు స్వచ్ఛంద ధార్మిక సంస్థలకు అంట కడుతూ కృష్ణార్పణం సమర్పించారు. వివరాలలోకి వెళితే నాగార్జునసాగర్ హిల్ కాలనీ లోని కృష్ణానది తీరాన నెహ్రూ పార్క్ ఎదురుగా ఉన్న స్థలాన్ని రామచంద్ర మిషన్ పేరిట నిర్వాహకులకు సమర్పించారు.

సాగర్ లో ఆగని ఎన్ఎస్పి భూమి కబ్జా..!

నాగార్జునసాగర్ , మన సాక్షి :

కృష్ణా నది తీరాన నాగార్జునసాగర్ నడిబొడ్డున ఎంతో విలువైన స్థలాన్ని ఎన్ఎస్పి అధికారులు స్వచ్ఛంద ధార్మిక సంస్థలకు అంట కడుతూ కృష్ణార్పణం సమర్పించారు. వివరాలలోకి వెళితే నాగార్జునసాగర్ హిల్ కాలనీ లోని కృష్ణానది తీరాన నెహ్రూ పార్క్ ఎదురుగా ఉన్న స్థలాన్ని రామచంద్ర మిషన్ పేరిట నిర్వాహకులకు సమర్పించారు.

సాగర్ లో ప్రముఖ ప్రాంతమైన విజయ విహార్ ను ఆనుకొని ఉన్న పది ఎకరాల భూమిలో గత కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుత్వాలు కోటి రూపాయలు ఖర్చుతో హిల్ కాలనీ వాసులకు త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి ఫిల్టర్ హౌస్ నిర్మించారు. దానితోపాటు 20 లక్షల రూపాయల వ్యయంతో ఆ స్థలం చుట్టూ ప్రహరీ గోడను కూడా ఏర్పాటు చేశారు. ఫిల్టర్ హౌస్ నిర్మాణంలో ఇంజనీరింగ్ వైఫల్యాలు ఉన్నందున ఆ నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేశారు.

సంబంధిత కాంట్రాక్టర్కు సైతం బిల్లులు చెల్లింపకుండా నిలిపివేయడంతో నేటికీ ఆ విచారణ కొనసాగుతూనే ఉంది. ప్రధాన రహదారికి పక్కనే ఉన్న ఆ విలువైన స్థలంపై కొందరు రాజకీయ నాయకులు కన్నేసిన భవిష్యత్తులో సాగరువాసులకు ఉపయోగపడే విధంగా నిర్మాణాలు చేపట్టాల్సి వస్తుందని, అది కోర్టు కేసులో ఉందని అప్పట్లో సాగర్ డ్యాం ఉన్నత అధికారులు తేల్చి చెప్పడంతో. ఆ విలువైన స్థలం అలాగే ఉండిపోయింది. ప్రస్తుతం రామచంద్ర మిషన్ వారు తాము నాగార్జునసాగర్ లో తమ మిషన్ కు సంబంధించిన నిర్మాణాలు చేసుకుంటామని స్థలం కావాలని ప్రభుత్వానికి వినతి చేసుకోవడంతో వారికి కావలసిన స్థలం సాగర్లో కేటాయించటానికి సాధ్య అసాధ్యాలపై వివరణ ఇవ్వాలని నాగర్జున సాగర్ ఉన్నత అధికారులకు ఆదేశించింది.

అయితే సాగర్ డ్యాం ఉన్నతాధికారులు రామ చంద్ర మిషన్ నిర్వాహకులకు అనుకూలంగా గతంలో ఫిల్టర్ హౌస్ నిర్మాణం చేపట్టి భవిష్యత్తులో ఉపయోగపడే విలువైన భూమిని రామచంద్ర మిషన్ నిర్వాహకులకు ఇవ్వవచ్చు అని లేఖ పూర్వకంగా తెలియజేశారు. ఇప్పుడు ఆ స్థలంలో ఆ సంస్థకు సంబంధించిన వారు భారీ యంత్రాలతో స్థలాన్ని చదును చేయడం ప్రారంభించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని పలు ప్రాంతాలలో ప్రాజెక్టు భూములను స్వచ్ఛంద సంస్థలకు ధార్మిక సంస్థల పేరిట నామమాత్రం రేటుకు అంట కట్టడం సర్వసాధారణం అయిపోయింది.

అదే పరంపరలో నాగార్జునసాగర్ లో రామ చంద్ర మిషన్ వారికి ఇవ్వటానికి వేరే చోట స్థలం ఉన్నా కూడా కృష్ణ నది తీరాన ఎంతో విలువైన స్థలాన్ని కేటాయించడంపై సాగర్ వాసులు అధికారులపై దుమ్మెత్తి పోస్తున్నారు. సాగర్ వాసుల తాగునీటి కష్టాలు తీర్చడం కోసం ప్రభుత్వాలు అమృతపాణి పథకం కింద సుమారు 40 కోట్ల రూపాయలు కేటాయించాలని దాని సంబంధించిన నిర్మాణాలు చేపట్టడానికి ప్రతిపాదనలు చేయాలని సూచించాయి . అయితే ప్రస్తుతము రామచంద్రా మిషన్ కు కేటాయించిన విలువైన విశాలమైన స్థలం హిల్ కాలనీలో ఎక్కడ లభ్యం కానీ పరిస్థితులలో కూడా ఆ స్థలాన్ని రాజకీయ ,అధికార ఒత్తిడిల కారణంగానే ఉన్నత అధికారులు సంబంధిత ధార్మిక సంస్థకు కేటాయించినట్లుగా తెలుస్తుంది.

ఈ విషయంలో నాగార్జునసాగర్ డ్యాం ఉన్నతాధికారులు సూపరింటెండెంట్ ఇంజనీర్ స్థాయి నుండి డి ఈ స్థాయి వరకు ఒకరు మరొకరిపై చెబుతూ తమకు ఈ విషయంలో ఏమి సంబంధం లేదని చెప్పడం విడ్డూరంగా ఉంది. కాగా ఎంతో విలువైన ఐదు ఎకరాల స్థలాన్ని 10 సంవత్సరాలకు లీజుకు రామచంద్ర మిషన్ కు నామమాత్రపు రేటుకు కేటాయించినట్లుగా తెలుస్తుంది . నాగార్జునసాగర్ లో రామచంద్ర మిషన్ సంస్థకు స్థలం కేటాయింపులో విచారణ చేసి ప్రస్తుతం నిర్మాణ పనులు చేస్తున్న స్థలానికి కేటాయించిన అధికారులకు సైతం ఆ స్థలం ఏ పరిస్థితుల్లో ఉందో, ఎంత మేరకు ఉందో తెలియకుండానే కేటాయించడం పలు అనుమానాలకు తావిస్తోంది.