మిర్యాలగూడ : కాంగ్రెస్ జెండా ఎగిరే దాకా పోరాడుతా: బి ఎల్ ఆర్
మిర్యాలగూడ : కాంగ్రెస్ జెండా ఎగిరే దాకా పోరాడుతా: బి ఎల్ ఆర్
మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:
మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లో బత్తుల లక్ష్మారెడ్డి గారు నిర్వహిస్తున్న హాత్ సే హత్ జోడో అభియాన్ పాదయాత్ర మంగళవారం మిర్యాలగూడ మండలాల లోని గ్రామాలు, గూడేలు, తండా లలో విశేష స్పందన తో 450 కిలోమీటర్లు కొనసాగి తుంగపాడు గ్రామం లో బహిరంగ సభతో నిర్వహించారు.
ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ నాయకుల లో, కార్యకర్తల లో బ్రహ్మాండమైన జోష్ తీసుకువచ్చింది అని అన్నారు. తుంగపాడు గ్రామం లో జరిగిన బహిరంగ సభ లో లక్ష్మారెడ్డి ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేస్తూ,మిర్యాలగూడ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే వరకు విశ్రమించనని అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో పాటు,మిర్యాలగూడ లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం కోసం నేను నిద్రపోను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిద్రపోనివ్వను అని అన్నారు.గత 20 రోజులుగా పాదయాత్ర సందర్భం గా గ్రామాల లోని పేదల సమస్యలను కష్టాలను పరిశీలించారు.కొద్ది రోజుల లోనే సమస్యల పరిష్కారం కోసం ఒక సమగ్ర విధానంతో ప్రకటన చేశారు.
తొమ్మిది సంవత్సరాలుగా ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ ప్రజాప్రతినిధుల అవినీతి, ఆగడాలు మితిమీరి పోతున్నాయి అని అన్నారు.ఊరికి రెండు సీసీ రోడ్లు వేసినంత మాత్రాన అది అభివృద్ధి కాదు అని అన్నారు..కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు కొద్దిగా పెంచి ఇవ్వడం తప్ప..
పేద ప్రజల కోసం టిఆర్ఎస్ పెద్దగా చేసింది ఏమీ లేదు అని అన్నారు. గత ఎన్నికల సమయం లో వాగ్దానం చేసినట్లుగా రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ ఇంతవరకు చేయలేదు ఆరోపించారు.పేద ప్రజల సంక్షేమం, విశ్వసనీయతకు మారుపేరు అయిన డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరుక్షణం విద్యుత్ బకాయిల రద్దు ఫైలు మీద సంతకం చేశారు.కేంద్రంలోని మన్మోహన్ సర్కార్ ను ఒప్పించి,రుణమాఫీని ఒకే దఫా అమలు చేయించాడు.
కొద్ది మాసాలలో రానున్న ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడడం ఖాయం అని అన్నారు.పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తామని భరోసా ఇస్తున్నాము అన్నారు.
తుంగపాడు గ్రామం బిఆర్ఎస్ పార్టీకి చెందిన యువకులు వంగాల రవీందర్ రెడ్డి, సజ్జల మన్మధ రెడ్డి, సజ్జల ప్రతాప్ రెడ్డి, చింతరెడ్డి మధు సూధను రెడ్డి, నారపు దాసు మధు, మహేశ్వరపు నరేష్, కట్టా సతీష్ రెడ్డి, బత్తుల సతీష్ యాదవ్, సిగపట్ల భరత్, కట్టబోయిన నరేందర్ , బి ఎల్ ఆర్ చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
గ్రామీణ ప్రాంతం లో ముగిసిన అభియాన్ పాదయాత్ర ను మిర్యాలగూడ పట్టణం లో త్వరలోనే ప్రారంభిస్తామని ప్రకటించారు.పాదయాత్రలో నాతో పాటు పాల్గొన్న సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువకులు, అభిమానులు, కళాకారులు, పత్రికల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ,పొదిల శ్రీనివాస్, తమ్మడబోయిన అర్జున్, .. గాయం ఉపేందర్ రెడ్డి .
చిల్లాపురం మాజీ సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ వెంకటేశ్వర్లు , మాజీ ఉపసర్పంచ్ బిక్షం, గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సజ్జల నరసింహ రెడ్డి , అంజయ్య,చిన్న మల్లయ్య ..కోఖ్య తండా, బాలాజీ నాయక్, రమేష్ నాయక్, మంఘ్తి , పొట్టిగాని తండా నాయకులు రమేష్ నాయక్ , ఆంజనేయులు , తుంగపాడు
నాయకులు సర్పంచ్ మచ్చ నాసమ్మ , ఎంపీటీసీ లావుడి అరుణ బలరాం, గ్రామ శాఖ అధ్యక్షుడు బెడుదురీ వెంకట్ రెడ్డి , సీనియర్ కాంగ్రెస్ నాయకులు మచ్చ వెంకన్న ,శేఖర్ రెడ్డి, కంచుగుంట్ల వెంకయ్య , సజ్జల చిన్న గోపి రెడ్డి, గాలి సత్యనారాయణ రెడ్డి, మచ్చ గాంధీ ,రేమడాల సత్యం , సర్పంచ్ లు ఎంపీటీసీలు, జడ్పీటిసి లు , కాంగ్రెస్ నాయకులు ,కార్యకర్తలు బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు.










