సుకన్య సమృద్ధి యోజనకు పోస్ట్ ఆఫీస్ లో బిఎల్ఆర్ ఆధ్వర్యంలో ఖాతాలు
సుకన్య సమృద్ధి యోజనకు పోస్ట్ ఆఫీస్ లో బిఎల్ఆర్ ఆధ్వర్యంలో ఖాతాలు
బి ఎల్ ఆర్ ఆధ్వర్యంలో వినూతన పథకం ప్రారంభం
మిర్యాలగూడ, మనసాక్షి :
కేంద్ర ప్రభుత్వం అందజేసే సుకన్య సమృద్ధి యోజనకు అర్హులైన వారికి ఆధ్వర్యంలో పోస్ట్ ఆఫీస్ లో ఖాతాలు తెరవనున్నట్లు సామాజికవేత్త కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి ఎల్ ఆర్ భత్తుల లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. గురు వారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మున్సిపల్ కౌన్సిలర్లు వార్డు ఇన్చార్జిల సమావేశం నిర్వహించడం జరిగింది. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు . పేద ఇంటి కుటుంబాలు కూతురు పుట్టగానే లక్ష్మీదేవి పుట్టిందని సంతోషించాలని, ఆమె భారం అవుతుందనే విధంగా ఏ కుటుంబం కూడా ఇబ్బంది పడకూడదని అన్నారు.
అందుకోసమే నేను ఈ చిరు ప్రయత్నం చేస్తున్నానని ఇప్పుడే పుట్టిన అమ్మాయి నుండి పది సంవత్సరంల వయసు వరకు ఉన్న అమ్మాయిలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటువంటి సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రతి ఒక్క ఆడ కూతురు ఉపయోగించుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. వార్డుల్లోని ప్రతి గడపకు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, ఇన్చార్జులు వెళ్లి ఈ సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రతి ఒక్కరికి అందేలా 250 రూపాయలను బిఎల్ఆర్ బ్రదర్స్ చెల్లించి పోస్ట్ ఆఫీస్ లో ఖాతాను ప్రారంభిస్తామని పేర్కొన్నారు .
ఆ తర్వాత ఆ ఖాతాలో ఇంకా ఎన్ని రూపాయలు జమ చేయాలి అనే విషయాన్ని బి ఎల్ ఆర్ బ్రదర్స్ అందరు కూడా కూర్చొని చర్చించిన తర్వాత శివరాత్రి పర్వదినం నుండి దాన్ని అమల్లోకి తెస్తామని తెలియజేశారు. శుక్రవారం ఈనెల 10వ తేదీ నుండి వారం రోజుల్లోపు ప్రతి వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులు , బి ఎల్ ఆర్ బ్రదర్స్ అందరు కూడా ప్రతి గడపకు వెళ్లి వారి వివరాలను సేకరించి ప్రతి ఒక్కరికి ఈ పథకం అందేలా చూస్తారని అన్నారు.
శివరాత్రి తర్వాత ఈ సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని మిర్యాలగూడ నియోజకవర్గం లోని అన్ని మండల కేంద్రాలలో ప్రారంభించి ప్రతి గ్రామంలోని గడపగడపకు వెళ్లి ప్రతి ఒక్క అమ్మాయికి ఈ పథకం అందేలా కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి ,డిసిసి జనరల్ సెక్రెటరీ చిలుకూరి బాలు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్జున్ ,బీసీ సంఘం రాష్ట్ర నాయకులు వెంకటేష్ గౌడ్ ,యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు హజార్, కౌన్సిలర్లు దేశిడి శేఖర్ రెడ్డి ,కొమ్ము శ్రీనివాస్, గంధం రామకృష్ణ, క్రికెటర్ జానీ ,కొమ్మన నాగలక్ష్మి, పందిరి అనిత ,రవి నాయక్, గుంజా చంద్రకళ, శ్రీనివాస్, చల్లా నాగలక్ష్మి ,వెంకన్న, మూఇస్ ,మాజీ కౌన్సిలర్లు బంటు లక్ష్మీనారాయణ, పాతూరి ప్రసాద్, బల్గురు శ్రీనివాస్, రమేష్ నాయక్ , వార్డు ఇన్చార్జులు ఇమ్రాన్ హలీం ,సంతోష్, నాగిరెడ్డి ,కోడిరెక్క ఇంద్ర కుమార్ ,గౌస్ ,గోదాల జానకిరామ్ రెడ్డి, మంచుకొండ శ్రీను, నాగరాజు, శరత్, నర్సింగ్, అంజి, బంటు శీను, కాశయ్య, శ్రీనునాయక్ ,మంగ్యా నాయక్ ,అబ్దుల్లా, మస్తాన్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.










