ములుగు : ఉద్యమకారునికి కన్నీటి వీడ్కోలు

ఉద్యమకారునికి కన్నీటి వీడ్కోలు

ఉద్యమ నేతకు కడసారి వీడ్కోలు పలికిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, ఎంపి జోగినిపల్లి సంతోష్.

మంగపేట , మన సాక్షి

ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ , బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కుసుమ జగదీష్ కు సోమవారం కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన గుండెపోటుతో ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే.

 

కాగా సోమవారం ఆయన అంత్యక్రియలకు జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు తరలివచ్చారు . అంత్యక్రియలలో మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.

 

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్. రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, రాష్ట్ర రైతు బంధు అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ లు, జెడ్పీ చైర్మన్ లు, జిల్లా అధ్యక్షులు, మరియు ఇతర ప్రజాప్రతినిధులు అంతిమయాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

 

తెలంగాణ ఉద్యమ కారుని ఈ జిల్లా కోల్పోయిందని పలువురు కొనియాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జగదీష్ పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని అన్నారు.