Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

BRS JOININGS : బిఆర్ఎస్ పార్టీలో చేరికలు

BRS JOININGS : బిఆర్ఎస్ పార్టీలో చేరికలు

చింతపల్లి.  మనసాక్షి.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం చేపడుతున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై వివిధ పార్టీల నుండి టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని దేవరకొండ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చింతపల్లి మండల పరిధిలోని పోలేపల్లి రాంనగర్ గ్రామానికి చెందిన సుమారు 50 మంది కార్యకర్తలు బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు ముద్దం జోగయ్య గౌడ్, కొప్పుల రాములు గౌడ్ ఆధ్వర్యంలో ఆయా పార్టీలకు రాజీనామా చేసి బి ఆర్ ఎస్ పార్టీలో చేయడం జరిగింది.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పార్టీలో చేరిన వారిని సాదరంగా ఆహ్వానించి గులాబీ జెండాను కప్పారు. అనంతరం పార్టీలో చేరిన కార్యకర్తలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఏ ప్రభుత్వాలు చేపట్టని అభివృద్ధి సంక్షేమ పథకాలు నేడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలకు న్యాయం చేకూర్చే విధంగా ముందుకు వెళ్తున్నారని వారి పేర్కొన్నారు. దేశంలో రైతుబంధు అందిస్తున్న ఘనత ఒక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే దక్కిందన్నారు. నేడు వివిధ రాష్ట్రాల ప్రజలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టే అభివృద్ధి పనులు చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ను అభినందిస్తున్నారని వారు వివరించారు.

 

ALSO READ :

  1. Chicken : చికెన్ కిలో రూ.100 మాత్రమే.. గంటలోనే అన్ని షాపుల్లో ఖాళీ..!
  2. TSRTC : ప్రయాణికులకు ఆర్టీసీ మరో శుభవార్త .. రూ. 50కే రోజంతా ప్రయాణం..!
  3. Atm Card : ఏటీఎం కార్డు వినియోగదారులకు ఆర్బీఐ కొత్త రూల్స్.. మారిన నిబంధనలు..!

 

రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని అందుకు కాలేశ్వరం లాంటి ప్రాజెక్టులను ముందుకు తీసుకొచ్చి పూర్తి చేసి వేలాది ఎకరాలకు సాగునీరు అందించి రైతాంగానికి పెద్దపీట వేస్తున్నారు. అదేవిధంగా దేవరకొండ నియోజకవర్గం లో కూడా డిండి కల్వకుర్తి ఎత్తిపోత పథకం ద్వారా రైతులకు అన్ని విధాలుగా ఆదుకునేందుకు ఈ పథకాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది అన్నారు.

 

రానున్న కాలంలో దేవరకొండ మునుగోడు నియోజకవర్గలు సాగునీటితో సస్యశ్యామలం కానున్నాయన్నారు. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్తు కూడా అందించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 9 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా బి ఆర్ ఎస్ పార్టీని విజయం సాధించడం తద్యమన్నారు.

 

నేడు వివిధ పార్టీల నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్క కార్యకర్తకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి మండలం దొంతం చంద్రశేఖర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు బుజ్జిని విద్యాసాగర్ రావు, సుమన్ నాయక్ చందు నాయక్, పోలేపల్లి గ్రామం నుండి పార్టీలు చేరిన కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు