Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

కాంగ్రెస్ పై బీఆర్ఎస్ దుష్ప్రచారం..!

కాంగ్రెస్ పై బీఆర్ఎస్ దుష్ప్రచారం..!

డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్

మిర్యాలగూడ , మన సాక్షి :

కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ అన్నారు. శుక్రవారం పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్ లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గాయం ఉపేందర్ రెడ్డి అధ్యక్షతన పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ పాల్గొని మాట్లాడారు. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చే రైతు బంధును నవంబర్ రెండో తారీకు లోపల ఇవ్వాలని డిమాండ్ చేశారు . అంతేగాని అసలు ఇవ్వద్దని ఎక్కడ చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు 15 వేల రూపాయల రైతుబంధును అందిస్తామని మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది.

కేవలం బీఆర్ఎస్ పార్టీ ఓట్ల కోసం అసత్య ఆరోపణలు చేస్తూ తెలంగాణ ప్రజలకు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకోవాలని చూస్తున్నది. ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మే పరిషితిలో లేరు. ఎవరు ఎన్ని సృష్టించిన ఈసారి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం మిర్యాలగూడలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా ఖచ్చితంగా అందరం కలిసి పనిచేసే మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం.

ALSO READ : Congress Second List : 45 మందితో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ విడుదల.. ఇవి పేర్లు..!

బీఆర్ఎస్ పార్టీ వారికి గునపాఠం చెప్పటానికి తెలంగాణ ప్రజానీకం మొత్తం ఎదురు చూస్తున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ చిరుమర్రి కృష్ణయ్య, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు పగిడి రామలింగయ్య యాదవ్ , కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి , మైనార్టీస్ జిల్లా అధ్యక్షులు సలీం ,ఎన్ ఎఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు ఆరిఫ్ , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్ , తలకొప్పుల సైదులు , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాలికాంత రెడ్డి ,

ALSO READ : డ్రామాలు ఆపి నవంబర్ 2 లోపు నిధులు ఇవ్వు.. లేదంటే కాంగ్రెస్ వచ్చి పెంచిన మొత్తం తో ఇస్తుంది..!

కాకునూరి బసవయ్య గౌడ్ , సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆవుల బకారెడ్డి ,ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నర్సింగ్ వెంకటేశ్వర్లు , మిర్యాలగూడ మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కంచుగట్ల లింగయ్య యాదవ్, ఓబిసిల్ నియోజకవర్గ అధ్యక్షులు కోట శ్రీనివాసరావు, ఐ ఎన్ టి సి పట్టణ అధ్యక్షులు చాంద్ పాషా ,

మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు గౌస్ ,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు కుక్కల సురేష్ , గూడూరు సర్పంచ్ నూకపొంగ శ్రీనివాస్ , పట్టణ కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు పోలిశెట్టి అజయ్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : Google Pay : గూగుల్ పే ఈజీ లోన్ రూ.15000, ఈఎంఐ కేవలం రూ. 111 మాత్రమే..!

మరిన్ని వార్తలు