సూర్యాపేట : బి ఎస్ పి సర్పంచ్ కిడ్నాప్ కు యత్నం

సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరు(S) మండలం పాతర్లపాడు గ్రామ సర్పంచ్ ను  కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న బీఎస్పీ కార్యకర్తలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని మంత్రి వర్గీయులను అక్కడి నుంచి పంపించారు.

సూర్యాపేట : బి ఎస్ పి సర్పంచ్ కిడ్నాప్ కు యత్నం

మంత్రి తీరును ఎండగట్టిన వట్టె జానయ్య యాదవ్

సూర్యాపేట, మనసాక్షి :

సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరు(S) మండలం పాతర్లపాడు గ్రామ సర్పంచ్ ను  కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న బీఎస్పీ కార్యకర్తలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని మంత్రి వర్గీయులను అక్కడి నుంచి పంపించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఎస్పీ పార్టీ సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్ మాట్లాడుతూ మంత్రి జగదీశ్ రెడ్డి పాలన నచ్చక బిఎస్పీ పార్టీలో చేరిన సర్పంచ్ ను కిడ్నాప్ చేయడం ఎంత దురదృష్టకరమో సూర్యాపేట నియోజకవర్గం ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.
అభివృద్ధి చూపించి ఓట్లు అడగాలి తప్ప ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఓట్ల అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

ALSO READ : తెలంగాణలో కాంగ్రెస్ తో కమ్యూనిస్టులకు పొత్తు ఉన్నట్టా..? లేనట్టా..?

బహుజన వాదం బలపడుతుండడంతో మంత్రి జగదీశ్ రెడ్డికి పిచ్చి పట్టి ఇష్టా రాజ్యాంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గతంలో నామీద, నా కుటుంబ సభ్యుల మీద కేసు నమోదు చేసింది గాక ప్రస్తుత కార్యకర్తల మీద కూడా పోలీసుల ద్వారా దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అక్రమాలకు పాల్పడుతున్న మంత్రి ఆగడాలను అరికట్టడానికి బీసీలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.

ఆయన వెంట పాతర్లపాడు సర్పంచ్ కేశబోయిన మల్లయ్య యాదవ్,ఇస్తాలపురం ఎంపీటీసీ చెరుకు ఇందిర, నాయకులు గాదగాని బిక్షపతి , కట్ట అజయ్, పబ్బతి కృష్ణ, కుంచెం కృష్ణ,పాండవుల సురేష్, ఆరింపుల వంశీరాజు, బొలక మధు, పబ్బతి సైదులు, గాదగాని గణేష్,జటంగి మహేష్, వెంకటేష్, లింగయ్య తదితరులు ఉన్నారు.

ALSO READ : BIG BREAKING : భాస్కర్ రావుకు న్యాయం చేయడమే అలవాటు.. నాకు కుడి భుజం గా ఉన్నారు..!