తెలంగాణలో కాంగ్రెస్ తో కమ్యూనిస్టులకు పొత్తు ఉన్నట్టా..? లేనట్టా..?

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కమ్యూనిస్టు పార్టీలకు పొత్తు ఉందో..? లేదో..? తెలియని పరిస్థితి నెలకొన్నది. జాతీయస్థాయిలో ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు తెలంగాణలో ఎన్నికల సమయంలో పొత్తు గురించి ఎటు తేల్చలేక పోతున్నాయి.

తెలంగాణలో కాంగ్రెస్ తో కమ్యూనిస్టులకు పొత్తు ఉన్నట్టా..? లేనట్టా..?

ఒంటరి పోరుకు సిపిఎం, సిపిఐ సిద్ధం..?

హైదరాబాద్, మన సాక్షి :

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కమ్యూనిస్టు పార్టీలకు పొత్తు ఉందో..? లేదో..? తెలియని పరిస్థితి నెలకొన్నది. జాతీయస్థాయిలో ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు తెలంగాణలో ఎన్నికల సమయంలో పొత్తు గురించి ఎటు తేల్చలేక పోతున్నాయి.

రాష్ట్రస్థాయిలో పొత్తులు రాష్ట్ర కమిటీలకే వదిలేసినట్లు సిపిఎం అగ్రనేత పేర్కొన్నారు. కాగా కాంగ్రెస్ తో కమ్యూనిస్టులు పొత్తు కుదుర్చుకుంటే సిపిఎంకు రెండు స్థానాలు, సిపిఐ కి రెండు స్థానాలు కేటాయించే దిశగా కాంగ్రెస్ చర్చలు నిర్వహించింది.

ALSO READ : BIG BREAKING : భాస్కర్ రావుకు న్యాయం చేయడమే అలవాటు.. నాకు కుడి భుజం గా ఉన్నారు..!

కానీ కమ్యూనిస్టులు కోరుకున్న సీట్లు దక్కే అంశంపై భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. అక్టోబర్ 30వ తేదీ నాటికి కమ్యూనిస్టులు కాంగ్రెస్ కు డెడ్ లైన్ పెట్టారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పొత్తుల అంశంపై కమ్యూనిస్టు పార్టీలు వెనుకడుగు వేస్తున్నాయి.

ఇలా ఉండగా సిపిఎం, సిపిఐ పార్టీలు బుధవారం వేరువేరుగా కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకుంటున్నాయి. కాంగ్రెస్ తో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. సిపిఎం 20 స్థానాల్లో, సిపిఐ 20 స్థానాల్లో పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఒంటరి పోరు విషయంపై కమ్యూనిస్టులు ఈరోజు సాయంత్రం వరకు తేల్చే అవకాశం ఉంది.

ALSO READ : ప్రజా వ్యతిరేక బిజెపి, బిఆర్ఎస్ పార్టీలను ఓడించండి : ఆకునూరు మురళి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి