DMart : డి మార్ట్ లో వారానికి ఆ రెండు రోజులు బంపర్ ఆఫర్స్.. సగం కంటే తక్కువ ధరలకే..!

DMart : డి మార్ట్ లో వారానికి ఆ రెండు రోజులు బంపర్ ఆఫర్స్.. సగం కంటే తక్కువ ధరలకే..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
డి మార్ట్ అతిపెద్ద వ్యాపార సంస్థ, అక్కడికి ఎప్పుడు వెళ్లినా కూడా పుష్కలంగా జనాలు ఉంటారు. ఈ మార్ట్ కు వెళ్లగానే వీళ్లంతా ఎవడ్రా బాబు అనాల్సి వస్తుంది. అంతేకాకుండా ఒక్కోసారి మనం 500 రూపాయల వస్తువులు కొనుగోలు చేయాలని వెళితే 5000 రూపాయల వరకు కూడా జేబుకు చిల్లు పడే అవకాశం ఉంటుంది. ఆఫర్స్, డిస్కౌంట్లు చూసి అవసరం లేకపోయినా కొనుగోలు చేసే పరిస్థితి వస్తుంది.
అంతే కాకుండా ఎంఆర్పీ ధరలకంటే తక్కువకు లభించడం వల్ల డిమార్ట్ స్టోర్ లో అన్ని రకాల వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. గృహపకరణాలు, కిరాణా సామాగ్రితో పాటు దుస్తులు కూడా లభిస్తుంటాయి. ఇక్కడ తక్కువ ధరలకు ఆఫర్స్ ఒకటి కొంటే ఒకటి ఉచితం, 50 శాతం డిస్కౌంట్, ఇలాంటి ప్రకటనల వల్ల జీతాలు పడగానే డిమార్ట్ కు వెళ్లి కొనుగోలు చేస్తుంటారు. అందుకే ఎప్పుడు వెళ్ళినా డి మార్ట్ కిటకిటలాడుతూ ఉంటుంది.
అయితే డీమార్ట్ కు వెళ్లి కిరాణా సామాగ్రి తో పాటు ఇతర వస్తువులను కొనుగోలు చేసేవారు ఈ విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రతి వారం (శుక్రవారం నుంచి ఆదివారం) వరకు ఎక్కువగా డిస్కౌంట్ ఆఫర్స్ పెడుతుంటారట. ఆ తర్వాత సోమవారం నుంచి క్లియరెన్స్ చేస్తారని సమాచారం. అయితే ఎక్కువగా శుక్ర శని, ఆదివారాల్లో కొనుగోలు చేస్తే డిస్కౌంట్ ఆఫర్స్ పొందే అవకాశం ఉందని తెలుస్తుంది.
డి మార్ట్ కి వెళ్లి కొనుగోలు చేసేవారిలో సోమవారం క్లియరెన్స్ ఉండటంతో ఒక్కోసారి సోమవారం కొన్ని వస్తువులపై మరింత తగ్గింపు ఉండే అవకాశం ఉంది. ఆన్‌లైన్ లో కొనుగోలు చేసే వారికి సోమ లేదా బుధవారాల్లో ఎక్కువగా ఆఫర్స్ ఉంటాయి. ఇక పండుగలు దసరా, దీపావళి, రంజాన్, క్రిస్మస్ లాంటి వాటి సందర్భంగా మరికొన్ని గృహపకరణాలు, దుస్తులు, ఇతర సామాగ్రిపై భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తుంటారు.
MOST READ :
-
Cyber : పీఎం కిసాన్ యోజన, ఎస్బిఐ రివార్డ్.. పేరుతో సైబర్ మోసాలు.. మెసేజ్ వస్తే ఎలా.. తెలుసుకుందాం..!
-
Suryapet : జిల్లా ఎస్పీ కీలక సూచన.. ఆ యాప్ ల జోలికి వెళ్తే ఇక ఖాతాలు ఖాళీ..!
-
Viral Video : రెండు నెలల క్రితం వివాహం.. సెల్ఫీ దిగుదామని భర్తను నది ఒడ్డుకు తీసుకెళ్లిన భార్య.. (వీడియో)
-
Gold Price : మళ్లీ చుక్కలనంటిన గోల్డ్ రేట్.. ఈరోజు ధర ఎంతంటే..!
-
New Ration Cards : ప్రజాపాలన, మీ సేవ కేంద్రాల ధరఖాస్తుదారులకు రేషన్ కార్డులు ఎప్పుడు..!










