లక్షెట్టిపేట్ : బైకులు, ఆటోలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

లక్షెట్టిపేట్ : బైకులు, ఆటోలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

లక్షేట్టిపేట్ , (మన సాక్షి);

లక్షెట్టిపేట పట్టణంలోని గోదావరి రోడ్డు కొత్త ప్లాట్లలో రామగుండం సీపీ రేమా రాజేశ్వరి (ఐపీఎస్) ఆదేశాల మేరకు గురువారం వేకువ జామున సీఐ కృష్ణారెడ్డి నేతృత్వంలో లక్షెట్టిపేట పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు.

 

కాలనీలో ఉన్న ఇండ్లలో క్షున్నంగా పరిశీలించారు. సుమారు 20బైక్లు, 3ఆటోలు, 1టాటా ఏసీ వాహనాన్ని స్వాదీనం చేసుకుని వాటి పత్రాలను పరిశీలించారు. ఈసందర్భంగా సీఐ మాట్లాడుతూ నేరాలను అదుపు చేయాలన్న ఉద్ద్యేశంతో పోలీసులు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందన్నారు. యువత మంచి ప్రవర్తనతో మెలగాలని చెడు వ్యసనాలకు బానిస కాకూడదన్నారు.

 

అంతే కాకుండా గంజాయి లాంటి వాటికి అలవాటు పడకూడదని వాటికి దూరంగా ఉండాలని యువతకు సూచించారు. ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానితులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రస్తుతం సైబర్ నేరాలు ఎక్కువగా వస్తున్నాయని వాటికి ఎవరూ గురి కాకూడదని ఫోన్లలో లోన్లు ఇస్తామని చెబితే స్పందించకూడదని అవన్ని ఫేక్ ఫోన్స్ అన్నారు.

 

🟢 ఎక్కువమంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి..👇

 

1. Telangana : తెలంగాణ ఎన్నికలకు ముందే ఐడి కార్డు ఉంటే సరిపోదు.. ఓటర్ల జాబితాలో మీ పేరు.. ఉందో? లేదో? ఇలా చూసుకోండి..!

2. Railway Recruitment : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో 3624 రైల్వే ఉద్యోగాలు..!

3. GPay : గూగుల్ పే వినియోగించే వారికి భారీ గుడ్ న్యూస్.. మళ్లీ క్యాష్ బ్యాక్.. ఎలానో తెలుసుకుందాం..!

 

 

ఎదైనా బ్యాంక్ పనులు ఉంటే నేరుగా బ్యాంక్ వెల్లి పని చేసుకోవాలని తెలిపారు. ఫోన్లలో తెలియని వ్యక్తులు ఓటిపి చెప్పమని అంటే చెప్పకూడదన్నారు. సీసీ కెమారాలను ఏరియాలో అమర్చుకోవాలని వాటి వల్ల ఏలాంటి నేరాలు కాకుండ ఉంటాయని వాటిపై అవగాహన కల్పించారు.

 

మూడనమ్మకాలను నమ్మకూడదని మంత్రాలు తంత్రాలు అన్ని మనల్ని నమ్మించడానికే అని వాటిని నమ్మి జీవితాలను నాషనం చేసుకోకూడదన్నారు. ఈకార్యక్రమంలో సీఐ కృష్ణారెడ్డితో పాటు లక్షెట్టి పేట, దండేపల్లి, జన్నారం ఎస్సైలు ఎస్,లక్ష్మన్, ప్రసాద్, సతీష్ కుమార్, ఇద్దరు ఎఎస్సైలు, 4హెచ్సీలు, 20మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.