రెండు బైకులు ఢీకొని ఒకరు మృతి. మండపాక వద్ద ఘటన

రెండు బైకులు ఢీకొని ఒకరు మృతి. మండపాక వద్ద ఘటన

వెంకటాపురం , మనసాక్షి

ములుగు జిల్లా వెంకటాపురం మండలం.రెండు బైకులు ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన వాజేడు మండలం మండపాక వద్ద 163 వ జాతీయ రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది తెలిసిన వివరాల ప్రకారం .. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గురికి వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

 

స్థానికులు హుటాహుటిన 108 వాహనంలో ఏటూరు నాగారం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.ఈ ముగ్గురిలో వెంకటాపురం మండలం బార్లగూడెం గ్రామ పంచాయతీకి చెందిన తడి. రవి అనే వ్యక్తి తలకు బలమైన గాయం కావడంతో వైద్యులు వరంగల్ ఎంజీఎం హాస్పటల్ కు తరలించారు.

 

వెళ్లే క్రమంలో మార్గమధ్యలోనే రవి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు వాజేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు