వేములపల్లిలో అధ్వానంగా పంట కాలువలు

వేములపల్లిలో అధ్వానంగా పంట కాలువలు

– బీళ్లగా మారుతున్న చివరి భూములు

వేములపల్లి, జూలై 02, మన సాక్షి : డిస్ట్రిబ్యాటరీ కాల్వలు అధ్వానంగా మారడంతో వానా కాలం సీజన్లో చివరి భూములకు నీరంధక బిళ్లగా మారే పరిస్థితి నెలకొంది. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం మొలకపట్నం- తిమ్మారెడ్డిగూడెం ఎల్ -17 కింద ఉన్న డిస్ట్రిబ్యాటరీ కాల్వ నిర్వహణ లోపంతో కంపచెట్లు, పిచ్చిమొక్కలు, పెరిగి శిథిలావస్థకు చేరుకొని నీరు పారే పరిస్థితి లేకుండా పోయింది కొందరు రైతులు కాలువను ఆక్రమించుకొని సేద్యం చేస్తూ ఉండడంతో నిరంతక దిక్కు తోచనిస్థితిలో ఉన్నామని చివరి భూముల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఫీల్డ్ అసిస్టెంట్ లో ఉపాధి హామీ పథకం కింద కూలీలతో డిస్ట్రిబ్యాటరీ కాలువలో పనులు చేయించడంతో నీళ్లుపారి భూములకు నీరందేదని, కాని ఫీల్డ్ అసిస్టెంట్లు లేకపోవడం ఆ పనులను ఇప్పుడు పంచాయతీ కార్యదర్శులకు అప్పజెప్పడంతో వారికి పని ఒత్తిడి మూలంగా డిస్ట్రిబ్యాటరీ కాల్వలను సరిగా పట్టించుకోకపోవడం లేదని దీంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాని పరిస్థితి నెలకొందని రైతులు పేర్కొంటున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్నందున సంబంధిత అధికారులు స్పందించి కాల్వలకు మరమ్మతులు చేయించి చివరి భూములకు నీరందేలా చూడాలని చివరి భూముల రైతుల కోరుతున్నారు.

కాల్వలు అధ్వానంగా ఉన్నాయి. – రెమాడల బిక్షం (మొల్కపట్నం, రైతు)

డిస్ట్రిబ్యాటరీ కాల్వలను అధికారులు పట్టించుకోకపోవడంతో పిచ్చిమొక్కలు,కంపచెట్లు, మొలిచి అద్వానంగా తయారయ్యాయి. దీంతో నీరుపారే పరిస్థితి లేక చివరి భూములు బిళ్లగా మారుతున్నాయి, అధికారులు స్పందించి కాల్వకు మరమ్మతులు చేయించి రైతులను ఆదుకోవాలి.

ఇవి కూడా చదవండి

1. BREAKING : డైనమిక్ సిటీ హైదరాబాద్ కి చేరుకున్నా.. మోడీ తెలుగులో ట్వీట్

2. పదవులు ఎవరికీ శాశ్వతం కాదు.. మార్పు వచ్చి తీరుతుంది కేసీఆర్‌

3. కరెంట్ బిల్లులు చెల్లించం, రైతుల అల్టిమేటం – latest news