సత్తుపల్లి టు కొత్తగూడెం భారీ కార్ల ర్యాలీ
సత్తుపల్లి టు కొత్తగూడెం భారీ కార్ల ర్యాలీ
సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మహాధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే సండ్ర
వందలాది కార్ల ర్యాలీతో మహాధర్నాకు బయలుదేరిన ఎమ్మెల్యే సండ్ర, పార్టీ శ్రేణులు
సత్తుపల్లి,మనసాక్షి:
కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరశిస్తూ,సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ భారీ కార్ల ర్యాలీతో సత్తుపల్లి నుండి కొత్తగూడెంలో బి.ఆర్.యస్ పార్టి చేపట్టిన మహాధర్నా కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో కలిసి సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు.
సింగరేణి గనుల వేలం, ప్రవేటీకరణను నిరసిస్తూ బిఅర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటి పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు బొగ్గు గనుల ప్రాంతాలలో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాధర్న కార్యక్రమానికి సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య సత్తుపల్లి నుండి వందల కార్లతో మహాధర్నా ప్రాంగణానికి ర్యాలీగా వెళ్ళి సంఘీభావం తెలిపి ధర్నాలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా గ్రంథాలయాల చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు,సత్తుపల్లి మున్సిపాలిటీ చైర్మన్ కూసంపూడి మహేష్,బిఆర్ఎస్ పార్టీ సత్తుపల్లి మండల ప్రెసిడెంట్ యాగంటి శ్రీనివాసరావు,సత్తుపల్లి జెడ్పిటీసి కూసంపూడి రామారావు,పెనుబల్లి జడ్పిటిసి చెక్కిలాల మోహన్ రావు,సత్తుపల్లి ఎంపీపీ దొడ్డ హైమావతి,ఆత్మ కమిటీ చైర్మన్ వనమా వాసు,
ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ శీలపు రెడ్డి హరికృష్ణ రెడ్డి,బిఅర్ఎస్ పార్టీ సత్తుపల్లి పట్టణ అధ్యక్షుడు రఫీ,సత్తుపల్లి మునిసిపాలిటీ వార్డు కౌన్సిలర్లు,నియోజకవర్గ ఎంపీటీసీలు,జడ్పిటిసిలు,సర్పంచులు,వార్డు కౌన్సిలర్లు,బిఆర్ఎస్ పార్టీ,కార్యకర్తలు,అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.











