సిసి కెమెరాల ఏర్పాటుతో నేరాల అడ్డుకట్ట – జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి
మిర్యాలగూడ, జూన్, 27, మన సాక్షి: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల పరిదిలోని తక్కెళ్ళపాడు గ్రామం నందు రూ. 8 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, డీఎస్పీ వెంకటేశ్వర్ రావు తో కలిసి జిల్లా యస్.పి. రెమా రాజేశ్వరి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిసి కెమెరాల ఏర్పాటుతో నేరాలను అరికట్ట వచ్చని అన్నారు. నల్లగొండ జిల్లా మొత్తాన్ని నిఘా నీడలోకి తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, ఇందుకు జిల్లా ప్రజల సహకారం ఎంతో అవసరం ఉందని తెలిపారు. రాబోయే రోజులలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విరివిగా ఉపయోగించుకొని, విజిబుల్ పోలీసింగ్ తో పాటు ఇన్ విజిబుల్ పోలీసింగ్ ను మరిన్ని రెట్లు పెంచి నిఘా వ్యవస్థను 24×7 జిల్లా అంతటా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. నేరాలను నిరోధించటంలోనూ, నేరస్తులను గుర్తించడంలో సీసీ కెమెరాలు , కమాండ్ కంట్రోల్ పాత్ర అమోఘమని జిల్లా యస్.పి. తెలిపారు.
సర్పంచ్ భిక్షం గౌడ్. అద్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చిట్టిబాబు నాయక్, మాజీ మార్కెట్ డైరెక్టర్ పులి జగదీష్, మండల పార్టీ అద్యక్షులు మట్టపల్లి సైదయ్య యాదవ్, మండల రైతుబంధుసమితి అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, వైస్ ఎంపిపి అమరావతి సైదులు, మాజీ ఎంపిపి ఓగ్గు జానయ్య, బోలిశెట్టి ఎల్లమ్మ, ఇంచార్జి తహసిల్దార్ అనిల్, సర్పంచులు శంకర్ నాయక్, రామచంద్రు నాయక్, రవీందర్ నాయక్, వీరా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :











